Active residency income : రూ. లక్షలు ఇస్తాం..మా గ్రామంలో వ్యాపారం చేయండి..ఇళ్లు ఇస్తాం ఇక్కడే ఉండండీ..

మా ఊరు రండీ..తక్కువ ధరకు ఇళ్లు ఇస్తాం, లక్షలు ఇస్తాం ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకోండి అని పిలుస్తోంది యూరప్ లోని ఇటాలియన్వి అందమైన లేజ్. ఇక్కడే ఉండండీ..ఇక్కడే వ్యాపారం చేసుకోండి అని పిలుస్తోంది.

Active residency income : రూ. లక్షలు ఇస్తాం..మా గ్రామంలో వ్యాపారం చేయండి..ఇళ్లు ఇస్తాం ఇక్కడే ఉండండీ..

Active Residency Income In Italian Village

Active residency income In Italian Village : బతకటానికి వలస వెళ్లటం కేవలం భారత్ లోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో జరిగేది ఇదే.కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఉంటే.మరికొన్ని ప్రాంతాల్లో పంటలకు నీటి వనరులు ఉండవు.ఇంకొన్ని ప్రాంతాల్లో జనాభా కొరత. ఇలా ఒక్కో ప్రాంతానిదీ ఒక్కో సమస్య. అలా వలసలు వెళ్లిపోయేవారిని ఆపటానికి ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.తగిన వసతులు కల్పించాలి.లేకుంటే వలసలు తప్పవు.

యురేపియన్ కంట్రీస్‌లోనైనా ఆఫ్రికా దేశాల్లోని పల్లెప్రజలు కూడా ప్రస్తుతం బతుకుదెరువు, కోసం పల్లెలు .. పట్నం బాట పట్టాయి. మరికొందరు పిల్లల చదువులు, ఉద్యోగాలు అంటూ రకరకాల కారణాలతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. దీంతో గ్రామాలే కాదు చిన్న చిన్న పట్టణాలు ఖాళీ అయిపోతున్నాయి. ఈ వలసలను ఆపాలని కొన్ని ప్రభుత్వాలు డిఫరెంట్ గా ఆలోచించాయి. చక్కటి ప్లాన్ వేసి వారిని ఆపేలా చేయటానికి క్రొయేషియా దేశంలోని ఓ సిటీలో ఇళ్లను కేవలం రూ.12 లకే విక్రయిస్తుంటే..యురేపియన్ లోని ఇటాలియన్ గ్రామం కూడా దాదాపు అలాగే ఆలోచించింది.

ఇటలీ దేశంలోని కాలాబ్రియా అనే పట్టణంలో ఇటాలియన్ గ్రామం చాలా అందంగా ఉంటుంది. సముద్రం, పర్వతాలు, ఎటు చూసిన పచ్చదనం. ప్రకృతి మాత దిగి వచ్చిందా? అన్నట్లుగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది. ఇంత అందంగా ఉండే ఈ గ్రామంలో జనాభా కొరత ఉంది. దీంతో ఆర్థిక సంక్షోభం కూడా ఉంది. ఊరువారంతా వలసలు వెళ్లిపోగా.. ఇక్కడ కేవలం 2,000 మంది మాత్రమే ఉన్నారు. ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇటాలియన్ గ్రామం. దీంతో స్థానికం ప్రభుత్వ అధికారులు ఇటాలియన్ లోనే ఉంటూ అక్కడే వ్యాపారం చేసుకుంటూ దాదాపు రూ.25 లక్షలు ఇస్తామని ప్రకటించారు.కొత్తగా వ్యాపారంగా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవారు మా ఊరు రండి డబ్బులిస్తాం అని రమ్మనిమని ఆహ్వానిస్తోంది. అదీ ఈ అందమైన గ్రామంలో ఉంటూ బిజినెస్ ను పెట్టుకోవడానికి ప్రభుత్వం రూ. .24.5 లక్షలు ఇస్తుంది. అలా వ్యాపారం చేద్దామని వెళ్లి కొంతకాలం కాలక్షేపం చేసి..వాటిని పట్టుకుని వచ్చేద్దామంటే కుదరదు. దీనికి ప్రభుత్వం కండిషన్స్ పెట్టారు అధికారులు.

ఇటాలియన్ లో ఇళ్లు తక్కువ ధరకే అమ్ముతారు. వాటిని కొనుక్కుని అక్కడే ఉండాలి. అలాగే ఇంటిని కొనే వ్యక్తి వయస్సు 40 ఏళ్ళు లోపు ఉండాలి. అంతేకాదు కొన్నేళ్లు పాటు ఈ గ్రామంలోనే నివసించాలి. ఇంటిని కొనుక్కుని ఇక్కడ వ్యాపారం చేయాలనుకునేవారు అధికారులకు అప్లై చేసుకోవాలి. అది కూడా మూడు నెలల్లో అప్లికేషన్లు అధికారులకు అందజేయాలి. ఈ ప్రాజెక్ట్ ను అక్కడ అధికారులు ‘యాక్టివ్ రెసిడెన్సీ ఆదాయం’ అని పేరు పెట్టారు. ఈ యాక్టివర్ రెసిడెన్సీ ఇన్ కమ్ గురించి పట్టణ మేయర్ మాట్లాడుతూ..యాక్టివర్ రెసిడెన్సీ ఇన్ కమ్ ప్రాజెక్టు సక్సెస్ అవ్వటానికి మా శాయశక్తులా కృషి చేస్తున్నాం.మాకు జనాభా కావాలి. వారి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంకావాలి. మళ్లీ ఇటాలియన్ గ్రామం జనాలతో కళకళలాడాలి. అందుకోసం ఇటాలియన్ ప్రాంతంలో నివసించడానికి ప్రజలను ఆకర్షించండి.. ఆధునిక సౌకర్యాలను కల్పిస్తాం..విద్య ఆరోగ్య సదుపాయాలను కల్పిస్తాం..హై-స్పీడ్ ఇంటర్నెట్‌ సదుపాయాన్ని ఇస్తామని తెలిపారు.

కాగా గత కొన్ని సంవత్సరాలుగా ఇటలీలోని అనేక పట్టణాలు జనాభా సమస్యను ఎదుర్కొంటున్నాయి.కొన్ని రోజుల క్రితం ఇటలీలోని బాసిలికాటా ప్రాంతంలోని లారెంజానా పట్టణం ఎటువంటి డిపాజిట్లు లేకుండా గృహాలను € 1 (యూరో)కు విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఇలా ఎలాగైనా జనాభాను పెంచుకోవాలని పలు సౌకర్యాలు ప్రకటిస్తున్నాయి.