Sponsor of Terrorism: ఉగ్రవాద స్పాన్సర్ రష్యా అని ప్రకటించిన యూరోపియన్ పార్లమెంట్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ఎక్కువగా నష్టపోయింది. ప్రస్తుతం ఈ దేశం యుద్ధ ఫలితాల్ని అనుభవిస్తోంది. అక్కడి కోట్లాది మంది ప్రజలు కనీస విద్యుత్ సౌకర్యం లేక అల్లాడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ మధ్యే వెల్లడించారు. ఇటీవల ఉక్రెయిన్‌లో విద్యుత్ రంగం లక్ష్యంగా రష్యా దాడులు చేసింది. అక్కడి విద్యుత్ ఉత్పత్తి, రవాణా కేంద్రాల్ని ధ్వంసం చేసింది

Sponsor of Terrorism: ఉగ్రవాద స్పాన్సర్ రష్యా అని ప్రకటించిన యూరోపియన్ పార్లమెంట్

European lawmakers declare Russia a state sponsor of terrorism

Sponsor of Terrorism: రష్యాను ఉగ్రవాద స్పాన్సర్ అని యూరోపియన్ పార్లమెంట్ (ఈయూ) బుధవారం ప్రకటించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో ఉక్రెయిన్‭లోని పౌరులు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఇళ్లు వంటి ప్రదేశాలపై రష్యా బాంబులు విసురుతోందని, ఇది అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని ఈయూ సభ్యులు పేర్కొన్నారు. అయితే దీన్ని చట్టబద్ధంగా ఆమోదించేందుకు ఈయూ వద్ద కచ్చితమైన చట్టబద్ధ ఫ్రేమ్‌వర్క్ లేదు. దీంతో ఈయూ ప్రతీకారంగానే రష్యాను ఇలా ప్రకటించిందనే విమర్శలు వస్తున్నాయి. కాగా, ఈ యుద్ధం నేపధ్యంలో రష్యాపై ఈయూ సహా అనేక ప్రపంచ దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. శతాబ్దానికి పైగా ఏ యుద్ధంలోనూ తలదూర్చని స్విట్జర్‭లాండ్ సైతం రష్యాపై ఆంక్షలకు పూనుకుంది. ఇంతకు ముందు ఇరాన్ దేశంపై అత్యధిక ఆంక్షలు ఉండేవి. అయితే ప్రస్తుతం ఈ విషయంలో రష్యా మొదటి స్థానంలోకి వచ్చింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ఎక్కువగా నష్టపోయింది. ప్రస్తుతం ఈ దేశం యుద్ధ ఫలితాల్ని అనుభవిస్తోంది. అక్కడి కోట్లాది మంది ప్రజలు కనీస విద్యుత్ సౌకర్యం లేక అల్లాడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ మధ్యే వెల్లడించారు. ఇటీవల ఉక్రెయిన్‌లో విద్యుత్ రంగం లక్ష్యంగా రష్యా దాడులు చేసింది. అక్కడి విద్యుత్ ఉత్పత్తి, రవాణా కేంద్రాల్ని ధ్వంసం చేసింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దేశంలోని అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా లేదు. ఫలితంగా దాదాపు కోటి మందికి పైగా ప్రజలు చీకట్లోనే ఉంటున్నారని జెలెన్‌స్కీ చెప్పారు. అయితే, సరఫరా మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అక్కడి ఒడెస్సా, విన్నిట్సియా, సుమీ, కీవ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

China-Protests: చైనాలోని ప్రపంచంలోనే అతిపెద్ద యాపిల్ ఐఫోన్ ఫ్యాక్టరీ వద్ద కలకలం.. వీడియో వైరల్