Europe Airport: పందులను రిక్రూట్ చేసుకున్న ఎయిర్‌పోర్ట్

ఆమ్‌స్టర్‌డమ్ స్కిఫోల్ ఎయిర్‌పోర్టుకు వింత సమస్య వచ్చిపడింది. నెదర్లాండ్స్ లోని ప్రధాన అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో 10.3 చదరపు మైళ్లు నీటితో నిండిపోయాయి.

Europe Airport: పందులను రిక్రూట్ చేసుకున్న ఎయిర్‌పోర్ట్

Europe Airport

Europe airport: ఆమ్‌స్టర్‌డమ్ స్కిఫోల్ ఎయిర్‌పోర్టుకు వింత సమస్య వచ్చిపడింది. నెదర్లాండ్స్ లోని ప్రధాన అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో 10.3 చదరపు మైళ్లు నీటితో నిండిపోయాయి. దీని వల్ల పక్షులకు, జంతువులకు ఆహారం దొరకడం వంటిది జరగ్గా, వ్యవసాయానికి కూడా అనుకూలంగా మారిపోయింది. అంతా బాగుందంటుకున్న సమయంలో అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో పక్షులు రావడం మొదలైంది.

ఈ పక్షుల రాకపోకలు అక్కడకు వచ్చిపోయే విమానాలకు ఆటంకంగా మారింది. రన్ వే మధ్యలో బాతుల గుంపు భారీ సంఖ్యలో కదులుతూ రాకపోకలకు జాప్యం కలిగిస్తున్నాయి. దీనిపై ఏవియేషన్ అధికారులు తెగ బాధపడిపోయారు. సాయం కోసం ఎదురుచూస్తుంటే అక్కడికి పందులు వచ్చి వారిని కాపాడాయి.

20పందుల టీంను ఆమ్‌స్టర్‌డమ్ స్కిఫోల్ ఎయిర్‌పోర్టు రిక్రూట్ చేసుకుంది. దీంతో విమానాలకు గతంలో ఉన్న రిస్క్ తగ్గిపోయింది. ప్యాసింజర్స్, సర్వీసుల దృష్ట్యా స్కిఫోల్ ఎయిర్‌పోర్టు మూడో అతిపెద్దది. ఎయిర్ కార్గో ఫెసిలిటీతో ఉన్న మేజర్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ కూడా.

…………………………………… : వాట్ ఏ క్యాచ్..అమ్మాయి పట్టిన క్యాచ్‌కు నెటిజన్లు ఫిదా

ఎయిర్‌పోర్టులోని ఉన్న ఆరు రన్ వేలపై బాతులు రాకుండా చూసుకునే బాధ్యత పందులదే. చుట్టూ ఉన్న 500ఎకరాల చెరకుతోటల్లో వాటిని వదిలిపెట్టి బాతులు రాకుండా కాపలాగా ఉంచారు. తీసుకొచ్చిన 12గంటల్లోనే పంటను మొత్తం తినేయడంతో బాతులు వచ్చి తినడానికి ఏం మిగల్లేదని అధికారులు చెబుతున్నారు.