Cancer Patients : వ్యాక్సిన్లు తీసుకున్న క్యాన్సర్ పేషెంట్లలో కూడా యాంటీబాడీలు : వెల్లడించిన తాజా అధ్యయనం

వ్యాక్సిన్లు తీసుకున్న క్యాన్సర్ పేషెంట్లలో కూడా యాంటీబాడీలు డెవలప్ అయ్యాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ చికిత్స చేయించుకునే పేషెంట్లపై కూడా..

Cancer Patients : వ్యాక్సిన్లు తీసుకున్న క్యాన్సర్ పేషెంట్లలో కూడా యాంటీబాడీలు : వెల్లడించిన తాజా అధ్యయనం

Cancer With Corona Vaccine Effective (1)

Corona Virus Cancer PatientsVaccine Effectiveness : కరోనా వ్యాక్సిన్లు ఎవరిమీద ఎలా పనిచేస్తాయి? టీకాలు తీసుకున్నాక వారిలో యాంటీబాడీలు ఏ స్థాయిలో డెవలప్ అవుతాయి అనే పలు అంశాలపై పరిశోధకులు ఇప్పటివరకు చాలామందిపై అధ్యయనాలు చేశారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు..బాలికల నుంచి గర్భిణీ స్త్రీల వరకు..సుదీర్ఘ వ్యాధులు ఉన్నవారిపై కూడా అధ్యయనాలకు చేశారు. కానీ ఇప్పటి వరకు క్యాన్సర్ పేషెంట్లపై కరోనా వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? అనే విషయంపై అధ్యయనాలు జరిగలేదు. కానీ అదికూడా చేశారు. శుభవార్త ఏమిటంటే క్యాన్సర్ పేషెంట్లపై కూడా వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తోందని సైంటిస్టులు తేల్చారు.

తాజాగా..791 మంది క్యాన్సర్ పేషెంట్లపై నెదర్లాండ్స్‌లో కొంతమంది సైంటిస్టులు చేసిన పరిశోధన చేయగా ఈ విషయం తేలిందని తెలిపారు. వ్యాక్సిన్ల సామర్థ్యంపై కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ప్రభావం ఎలా ఉంది అనే అంశంపై అధ్యయనం చేయగా సానుకూల అంశాలు వెల్లడయ్యాయి.

Read more : Pfizer Covid Vaccine : ఇక పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితే..కరోనాకు తయారు చేసిన వ్యాక్సిన్లు క్యాన్సర్ పేషెంట్లపై కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయని నెదర్లాండ్స్‌లో కొందరు శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గతంలో చేసిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ క్యాన్సర్ పేషెంట్లపై జరగలేదు. క్యాన్సర్ చికిత్స వల్ల వారి రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుందనే విషయం తెలిసిందే.

ఈక్రమంలో క్యాన్సర్ చికిత్స చేయించుకున్నవారిపై అంటూ కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ వంటి చికిత్సలు చేయించుకున్నవారిపై కరోనా వ్యాక్సిన్ ప్రభావం చూపుతుందా? చూపితే వారిలో యాంటీబాడీలు ఎలా డెవలపర్ అవుతాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటి వరకూ లభించలేదు. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్‌లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 791 మంది పేషెంట్లపై పరిశోధకులు అధ్యయనం చేశారు. అధ్యయం చేసినవారిలో క్యాన్సర్ లేనివారితోపాటు క్యాన్సర్ రోగులు కూడా ఉన్నారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ చేయించుకునేవారితో పాటు ఇమ్యూనోథెరపీ చేయించుకునేవారు వారు కూడా ఉన్నారు.

Read more : Covid Vaccine.. మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చగలదు.. ఎలాగంటే?

ఈ పేషెంట్లపై సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించారు. ఆ తరువాత వారిని నిశితంగా పరిశీలించారు. వ్యాక్సిన్లు ఇచ్చిన కొన్ని రోజుల తరువాత వారికి పరిక్షలు నిర్వహించగా..కరోనా వ్యాక్సిన్ తీసుకున్న క్యాన్సర్ పేషెంట్లలో కూడా కరోనా యాంటీబాడీలు పుష్కలంగా రికార్డయ్యాయని తేలింది. అంతేకాదు సాధారణ క్యాన్సర్ చికిత్సే కాకుండా కీమో థెరపీ తీసుకుంటున్న క్యాన్సర్ పేషెంట్లలో యాంటీబాడీలు చక్కగా డెవలప్ అయ్యాయని తేలింది. కీమో థెరపీ తీసుకుంటున్న పేషెంట్లలో 84 శాతం ఉండగా యాంటీబాడీలు ఉండగా, కీమో, ఇమ్యూనోథెరపీ తీసుకునేవారిలో ఏకంగా 89 శాతం, ఇమ్యూనోథెరపీ తీసుకునేవారిలో 93 శాతం యాంటీబాడీలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.

యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ (ఈఎస్‌ఎమ్‌వో) వార్షిక సమావేశంలో ఈ అధ్యయనయంలో తేలిన ఫలితాలను అంతర్జాతీయ పరిశోధకుల ముందుంచారు. ఈ సందర్భంగా పరిశోధకుల బృందంలో

అనంతరం క్యాన్సర్ పేషెంట్లకు ‘బూస్టర్ డోస్’గా ఇచ్చే మూడో వ్యాక్సిన్ మరింత ప్రభావవంతంగా ఉండే అవకాశం ఉందని యూరోపియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలో ఊపిరితిత్తుల క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ ఆంటోనియో పసారో తెలిపారు.