ఉద్యోగం మారినందుకు రూ.1300 కోట్లు ఫైన్

ఉద్యోగం మారితే ఫైన్ వేయడం ఏంటి? అదీ రూ.1300 కోట్లు చెల్లించమనడం ఏంటి? అనే సందేహం వచ్చింది కదూ. ఉద్యోగం మారడం నేరమా? అని మీరు అడగొచ్చు. కాదని మీరు

  • Published By: veegamteam ,Published On : March 7, 2020 / 01:55 AM IST
ఉద్యోగం మారినందుకు రూ.1300 కోట్లు ఫైన్

ఉద్యోగం మారితే ఫైన్ వేయడం ఏంటి? అదీ రూ.1300 కోట్లు చెల్లించమనడం ఏంటి? అనే సందేహం వచ్చింది కదూ. ఉద్యోగం మారడం నేరమా? అని మీరు అడగొచ్చు. కాదని మీరు

ఉద్యోగం మారితే ఫైన్ వేయడం ఏంటి? అదీ రూ.1300 కోట్లు చెల్లించమనడం ఏంటి? అనే సందేహం వచ్చింది కదూ. ఉద్యోగం మారడం నేరమా? అని మీరు అడగొచ్చు. కాదని మీరు గట్టిగా వాదించొచ్చు. మన సంగతి పక్కన పెడితే.. కచ్చితంగా తప్పే అని గూగుల్ కంపెనీ అంటోంది. అంతేకాదు.. ఉద్యోగం మారిన ఉద్యోగిపై కోర్టుని ఆశ్రయించింది. కోర్టు అతగాడికి రూ.1300 కోట్లు ఫైన్ వేసింది. ఆ మొత్తాన్ని గూగుల్ కంపెనీకి చెల్లించాలని ఆదేశించింది. షాకింగ్ గా ఉన్నా.. ఇది నిజం.

ఒప్పందాన్ని ఉల్లంఘించి ఉద్యోగం మారాడు:
ఓ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి మరో కంపెనీకి మారడం ఆ ఇంజినీర్ పాలిట శాపమైంది. ఆంటోనీ లావన్డోస్కీ అనే వ్యక్తి గూగుల్‌లో ఇంజనీర్‌గా పని చేసేవాడు. ఉబర్‌ లో మంచి అవకాశం, హై సాలరీ రావడంతో.. జాబ్ మారాడు. ఈ విషయాన్ని గూగుల్ కు చెప్పలేదు. గూగుల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ ఆ ఇంజినీర్ వెళ్లిపోయాడు. 

రగిలిపోయిన గూగుల్:
దీంతో గూగుల్‌ కు కడుపు మండింది. జాబ్ మారడంలో తప్పు లేదు.. కానీ రూల్స్ బ్రేక్ చేసి వెళ్లిపోవడం తట్టుకోలేకపోయింది. అతడికి చుక్కలు చూపించాలని డిసైడ్ అయ్యింది. ఆ ఇంజినీర్ పై కోర్టుని ఆశ్రయించింది. తమ కంపెనీ రహస్యాలు దొంగిలించి వెళ్లిపోయాడని ఆంటోనీపై కోర్టులో కేసు వేసింది. ఈ కేసు విషయంలో అతడికి ఉబర్‌ కంపెనీ న్యాయపరమైన రక్షణ కల్పిస్తూ వచ్చింది. కొంత కాలానికి అతడు ఉబర్‌ నుంచి కూడా నిష్క్రమించి రైడ్‌ షేర్‌ అనే మరో కంపెనీకి మారిపోయాడు. దీంతో ఉబర్‌.. అప్పటి వరకూ తను కల్పిస్తున్న న్యాయ రక్షణను ఉపసంహరించుకుంది.

ఆంటోనీకి దిమ్మతిరిగే షాక్:
కేసును విచారించిన కోర్టు.. ఇంజినీర్ ఆంటోనికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. రూ. 13 వందల కోట్లు గూగుల్‌కు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆంటోనీ పరిస్థితి దయనీయంగా మారింది. దురాశ దుఖానికి చేటు అన్న మాట ఆ ఇంజనీర్ విషయంలో నిజమైందని అంతా అనుకుంటున్నారు. జాబ్ మారడం, జీవితంలో ఎదగాలని అనుకోవవడంలో తప్పు లేదు. కానీ ఇలా రూల్స్ బ్రేక్ చేసి.. అడ్డదారిలో వెళ్తానంటే మాత్రం ఎవరూ ఒప్పుకోరు అని నెటిజన్లు అంటున్నారు.

See Also | కరోనా వైరస్ : 3 వేల మంది బలి..80 వేల మందికి చికిత్స