Covid-19: సహజంగా వస్తే.. వైరస్ ప్రభావం ఇంతకాలం ఉండదు.. కరోనా వైరస్ చైనీస్ సృష్టే..

చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ను ఒక ప్రయోగశాలలో సృష్టించారని, ఆపై వైరస్ రివర్స్-ఇంజనీర్ వెర్షన్లు గబ్బిలాల నుంచి సహజంగా ఉద్భవించినట్లు కనిపించేలా చేయడానికి ప్రయత్నించారని కొత్త అధ్యయనం చెబుతుంది.

Covid-19: సహజంగా వస్తే.. వైరస్ ప్రభావం ఇంతకాలం ఉండదు.. కరోనా వైరస్ చైనీస్ సృష్టే..

Explosive Study Chinese Scientists Created Corona Virus

Chinese created COVID: చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ను ఒక ప్రయోగశాలలో సృష్టించారని, ఆపై వైరస్ రివర్స్-ఇంజనీర్ వెర్షన్లు గబ్బిలాల నుంచి సహజంగా ఉద్భవించినట్లు కనిపించేలా చేయడానికి ప్రయత్నించారని సంచలనంగా కొత్త అధ్యయనం బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించి, “చైనాలో రెట్రో-ఇంజనీరింగ్” కి సంబంధించిన ప్రాధమిక ఆధారాలు ఉన్నట్లుగా బ్రిటీష్ ప్రొఫెసర్ అంగస్ డాల్గ్లీష్ మరియు నార్వేజియన్ శాస్త్రవేత్త డాక్టర్ బిర్గర్ సోరెన్‌సెన్ తమ అధ్యయనంలో వెల్లడించారు.

విద్యావేత్తలు మరియు ప్రధాన వైద్య పత్రికలు ఈ విషయాన్ని విస్మరించాయని డైలీ మెయిల్ శనివారం నివేదించింది. సహజంగా వచ్చిన వైరస్ ఏదీ కూడా ఇంతకాలం ఉండదని, సహజంగా వైరస్ పుట్టే అవకాశం చాలా తక్కువ. అని ఈ వైరస్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రోజుకు 12వేల మందిని చంపుతోందని అధ్యయనం స్పష్టం చేసింది.

డాల్గ్లీష్ లండన్ ఆంకాలజీ ప్రొఫెసర్, హెచ్ఐవి వ్యాక్సిన్ పురోగతిలో చాలాకాలంగా పనిచేస్తున్నారు. సోరెన్‌సెన్ ఒక వైరాలజిస్ట్. వారి COVID-19 వ్యాక్సిన్ పరిశోధనలో ఈ విషయాలను గమనించినట్లు వెల్లడించారు. భౌతిక శాస్త్ర నియమాలు ప్రకారం.. కరోనా వైరస్ నాలుగు ధనాత్మక చార్జ్ చేసిన అమైనో ఆమ్లాలను కలిగి ఉంది. దీనిని బట్టి చూస్తే.. కృత్రిమంగా తయారు చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది.

వైరస్‌ను సృష్టించే సాధనాలు ఎలా నిర్మించబడ్డాయో చూపించడానికి వారు ప్రచురించిన చైనీస్ పరిశోధనలను కూడా ట్రాక్ చేశారు, కొందరు అమెరికన్ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేశారు. సమీక్షించిన డేటా ప్రకారం.. ప్రయోగశాలలో సహజ వైరస్‌లను మరింత అంటువ్యాధులుగా మార్చడం, శాస్త్రవేత్తలు మానవులపై వాటి సంభావ్య ప్రభావాన్ని అధ్యయనం చేసినట్లుగా అనుమానిస్తున్నారు.

2014లో ఇటువంటి పరిశోధనలపై అమెరికా తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అయితే చైనాలో వైద్య పరిశోధనల కోసం 6లక్షల డాలర్ల నిధులను కేటాయించినట్లుగా డాక్టర్ ఆంథోనీ ఫౌసీ గత వారం కాంగ్రెస్‌కు చెప్పారు. ఒక సహజ వైరస్ మహమ్మారిగా పరివర్తన చెందవచ్చని, అంటువ్యాధిగా మారుతుందని, అయితే తక్కువ వ్యాధికారకంగా ఉంటుందని వారు చెబుతున్నారు. COVID-19 మహమ్మారి మాత్రం అలా కనిపించట్లేదు అని అన్నారు.

గతంలో చైనీస్ వైద్య నిపుణులు, వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేసింది. చైనా ప్రభుత్వ ప్రయోగశాలలో సార్స్-కోవ్‌-2 వైర‌స్ త‌యారైన‌ట్లు ఆరోపించడం అప్పట్లో సంచలనం రేపింది. 2015లో చైనా రక్షణరంగ శాస్త్రవేత్తల, వైద్య నిపుణుల మధ్య చర్చలకు సంబంధించిన రీసెర్చ్ పేపర్ బయటకు వచ్చినప్పుడు కూడా ఇదే రకమైన చర్చ జరిగింది.