కరోనాకి దూరంగా : సోషల్ డిస్టెన్సింగ్ ‘షూ’

  • Published By: madhu ,Published On : June 1, 2020 / 04:25 AM IST
కరోనాకి దూరంగా : సోషల్ డిస్టెన్సింగ్ ‘షూ’

కరోనాతో ప్రపంచం అల్లాడుతోంది. వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. లాక్ డౌన్ ఒక్కటే శరణ్యం అని భావించి పలు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ కొన్ని సడలింపులు ఇవ్వడంతో ప్రజలు రక్షణ చర్యలు పాటించడం లేదు.

భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు తప్పకుండా వాడాలని సూచిస్తున్నా కొంతమంది బేఖాతర్ చేస్తున్నారు. ఫలితంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. క్యూ లైన్లలో ఉన్నా..బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న సమయంలో గొడుగు తప్పకుండా వాడాలని సూచించారు. దీనివల్ల దూరం పెరుగుతుందని ఆ విధంగా సూచనలు చేస్తున్నారు. తాజాగా సోషల్ డిస్టెన్సింగ్ లో ‘షూ’ కూడా వచ్చి చేరింది. 

రొమోనేయాలో ఈ షూస్ మార్కెట్ లో లభ్యమౌతున్నాయి. దీనిని కొనేందుక జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అక్కడ లాక్ డౌన్ సడలించడంతో జనాలు రోడ్ల మీదకు తండోపతండాలుగా వచ్చేశారు. కనీసం భౌతిక దూరం పాటించకపోతుండడాన్ని ట్రాన్సిల్వేనియాకు చెందిన గ్రిగర్ లుప్ గ్రహించాడు.

దీనికి చెక్ పెట్టేందుకు వినూత్నంగా ఆలోచించాడు. వెరైటీ షూ తయారు చేశాడు. ముందు భాగం పొడవుగా ఉండేలా తయారు చేశాడు. యూరోపియన్ సైజు సంఖ్య 75లో రూపొందించాడు. ఈ షూ ధరించడం వల్ల మనిషికి మనిషికి కనీసం ఒక మీటర్ దూరం ఉంటుంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని అతను అంటున్నాడు. గ్రిగర్ లూప్ 2001 నుంచి లెదర్ బూట్లను తయారు చేస్తున్నాడు. వీటిని చూసిన వారందరూ బెస్ట్ అంటున్నారు. 

Read: కరోనా కరాళ నృత్యం: ప్రపంచంలో ఏడవ స్థానంలోకి భారత్