Covid-19: మాస్క్‌లు పెట్టుకోండి.. విమాన ప్రయాణికులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన

ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని దేశాలకు సూచనలు చేసింది.

Covid-19: మాస్క్‌లు పెట్టుకోండి.. విమాన ప్రయాణికులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన

Covid-19: కోవిడ్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా సూచనలు చేసింది. ఎక్కువ దూరం, ఎక్కువ గంటలు విమానాల్లో ప్రయాణాలు చేసే వాళ్లు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించింది.

Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు

ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని దేశాలకు సూచనలు చేసింది. యూరప్ అధికారులతో కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాజా సూచనలు చేశారు. కోవిడ్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలని ఆదేశించింది. దీనివల్ల కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

Madhya Pradesh: మోదీని చంపాలంటూ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతకు బెయిల్ నిరాకరించిన కోర్టు

అన్ని దేశాలూ ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే ముందుగానే కోవిడ్ టెస్టులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇటీవల యూరోపియన్ యూనియన్ (ఈయూ) కు చెందిన 27 దేశాలు చైనా నుంచి వచ్చే లేదా చైనా వెళ్లే ప్రయాణికులకు కోవిడ్ టెస్టును తప్పనిసరి చేశాయి.

ప్రస్తుతం ఉన్న నివేదిక ప్రకారం… ఎక్స్‌బీబీ.1.5 వేరియెంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇది ఒమిక్రాన్ సబ్ వేరియెంట్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగేందుకు ఈ వేరియెంటే కారణం.