Boycott Facebook: ఫేస్‌బుక్‌ను బహిష్కరించాలి.. నవంబర్10కి లింక్ ఏంటి

అమెరికా వేదికగా ఇస్తున్న పిలుపును ప్రపంచమంతా పాటించాలని.. అలా చేయడం వల్లే సోషల్ మీడియా సంస్కరణలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Boycott Facebook: ఫేస్‌బుక్‌ను బహిష్కరించాలి.. నవంబర్10కి లింక్ ఏంటి

Facebook Boycott

Boycott Facebook: అమెరికా వేదికగా ఇస్తున్న పిలుపును ప్రపంచమంతా పాటించాలని.. అలా చేయడం వల్లే సోషల్ మీడియా సంస్కరణలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2021 నవంబర్‌ 10 ఒక్కరోజున ఫేస్‌బుక్‌, అనుబంధ యాప్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఆ ఒక్కరోజు లాగౌట్ చేసి వాటికి దూరంగా ఉండాలని అంతర్జాతీయ పౌరహక్కుల సంఘాలు, సామాజిక న్యాయ కార్యకర్తలు కోరుతున్నారు.

గతంలో 2018 టైంలో కేంబ్రిడ్జి అనలిటికా స్కాండల్‌ వెలుగుచూడడంతో డిలీట్‌ఫేస్‌బుక్‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అయింది. అలా జరగడం వల్ల యూజర్లు కోల్పోయే నష్టం జరగకపోయినప్పటికీ.. కంపెనీ స్టాక్‌ ధరలు పడిపోయాయి. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఫేస్‌బుక్‌కు కొన్ని నెలల సమయం పట్టింది. ప్రస్తుతం చేస్తున్న బాయ్‌కాట్ ఫేస్‌బుక్ ట్యాగ్‌కు కారణాలివే..

* ఇంటర్నెట్‌లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం
* మతపరమైన విద్వేషాలు పెరిగిపోవడానికి కారణమవుతుండటం
* తప్పుడు సమాచారం వ్యాప్తి, తప్పుదోవ పట్టించే వైఖరి
* యూజర్‌ భద్రత విషయంలో పూర్తిగా వైఫల్యం
* కోట్లమంది వాట్సాప్‌ యూజర్ల డేటాపై నిఘా
* ఫొటో ఫీచర్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌పై సైతం నిరసన
* టీనేజర్లపై మానసికంగా దుష్ప్రభావం చూపెడుతుందని తెలిసి కూడా తగిన చర్యలు ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకోకపోవడం
* మార్క్‌ జూకర్‌బర్గ్‌ను సీఈవో పదవి నుంచి తొలగించాలని..
* అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌ ఫర్‌ కిడ్స్‌ ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్‌.

కైరోస్‌ అనే సంస్థ ఈ క్యాంపెయిన్‌ను మొదలుపెట్టింది. కొన్ని దేశాల్లో ప్రజావ్యతిరేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి మొదలైన ఈ ప్రచారం.. ఫేస్‌బుక్‌ ద్వారానే పుంజుకుంటోంది. అందుకే నవంబర్‌ 10న.. మొదలుపెట్టి 24 గంటలపాటు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ను లాగౌట్‌ చేయాలని కోరుతున్నారు.

ఫేస్‌బుక్‌ సంపాదన 98.5 శాతం వాటా యాడ్స్‌తోనే వస్తోంది. యూజర్ల అవసరాలు.. డేటా సెర్చింగ్‌ పై నిఘా వేసి.. సోషల్‌ మీడియాలో యాడ్స్‌ రూపంలో ప్రదర్శించడం తెలిసిందే.