Facebook బగ్‌తో సమస్యలు.. ఈమెయిల్ ఐడీలు.. బర్త్ డేలు బట్టబయలు

Facebook బగ్‌తో సమస్యలు.. ఈమెయిల్ ఐడీలు.. బర్త్ డేలు బట్టబయలు

Facebook బగ్.. బర్త్ డేలు.. ఈమెయిల్ ఐడీలు బట్టబయలు చేసేస్తుందని సైబర్ రీసెర్చర్ కనుగొన్నారు. దీని కారణంగా Facebookతో పాటు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డేటాలు కూడా బయటపెట్టేస్తుంది. సాధారణంగానే మనం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు.. బర్త్ డేలు, ఈ మెయిల్ అడ్రస్ లాంటివన్నీ అడుగుతుంది. సైబర్ అటాకర్స్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌తో ప్రమాదం సృష్టించే అవకాశఆలు ఉన్నాయి.

ఇది ఓ ఎక్స్‌పర్మెంటల్ ఫీచర్ అని సమాచారం. కొన్ని బిజినెస్ అకౌంట్లకు దీని ఫీచర్ యాక్సెస్ ఇచ్చినట్లు డేటా మొత్తం వారి నుంచే బయటకు వెళ్తున్నట్లు చెప్తున్నారు. Facebook బిజినెస్ సూట్ టూల్ కారణంగా ఇలా జరుగుతుందట. అది కేవలం Facebook బిజినెస్ అకౌంట్స్ ఉన్నవారికి మాత్రమే కుదురుతుందట.

‘అకౌంట్లు డైరక్ట్ మెసేజ్‌ను యాక్సెప్ట్ చేయకపోతే యూజర్ కు ఎటువంటి నోటిఫికేషన్ రాదు. అయితే వారి ప్రొఫైల్ చూసినట్లుగా కనిపించొచ్చు. అంతే’ అని సౌగత్ శుక్రవారం వెల్లడించారు. దాంతో పాటు ఈ బగ్ కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని.. దాని ప్రయోగాత్మకంగా అక్టోబర్ లో స్టార్ట్ చేశామని పోఖరెల్ అన్నారు. ఒకవేళ ఏవైనా సమస్యలు వస్తే ఫిక్స్ చేయడంలో Facebook చాలా ఫాస్ట్ గా ఉంటుందని అన్నారు.

బిజినెస్ అకౌంట్ల కోసం చేసిన టెస్టులో ఓ రీసెర్చర్ సమస్య కనుగొన్నారు. అందులో వారు చేసిన పర్సనల్ మెసేజ్ కూడా రివీల్ అయిపోతుంది. దానిని వెంటనే సాల్వ్ చేసేశాం. దీని గురించి రిపోర్ట్ చేసిన రీసెర్చర్ కు రివార్డ్ కూడా ఇచ్చాం’ అని Facebook అధికార ప్రతినిధి తెలిపారు.