Afghanistan: వారు ఉగ్రవాదులే.. తాలిబాన్ల కంటెంట్‌ని నిషేధించిన ఫేస్‌బుక్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాలిబాన్‌లను వారి అన్నీ ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి నిషేధించినట్లు తాలిబన్లను ఉగ్రవాదులుగా గుర్తించినట్లు ప్రకటించింది.

Afghanistan: వారు ఉగ్రవాదులే.. తాలిబాన్ల కంటెంట్‌ని నిషేధించిన ఫేస్‌బుక్

Taliban (1)

Afghanistan: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాలిబాన్‌లను వారి అన్నీ ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి నిషేధించినట్లు తాలిబన్లను ఉగ్రవాదులుగా గుర్తించినట్లు ప్రకటించింది. వారికి సంబంధించిన కంటెంట్ షేర్ చేసినవారిని కూడా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. కానీ, తాలిబన్లు ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్టెడ్ మెసేజ్‌లను పంపే వాట్సాప్‌ను మాత్రం వాడుతూనే ఉన్నారు. కంపెనీ నిషేధం విధించినా వారిని అడ్డుకోలేకపోతున్నారు.

తాలిబాన్‌లకు సంబంధించిన కంటెంట్‌ను పంచుకున్నా కూడా ఆ గ్రూపును తీవ్రవాద సంస్థగా పరిగణించి తొలగించనున్నట్లు వెల్లడించింది. గ్రూప్‌తో లింక్ చేయబడిన కంటెంట్‌ను పర్యవేక్షించడానికి మరియు తీసివేయడానికి ఆఫ్ఘన్ నిపుణుల ప్రత్యేక బృందం తమ వద్ద ఉందని కంపెనీ చెబుతోంది. కొన్నేళ్లుగా, తాలిబాన్లు వారి సందేశాలను వ్యాప్తి చేసుకునేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. అయితే, పరిస్థితిని సంస్థ నిశితంగా గమనిస్తోందని పేర్కొన్నారు.

నిషేధిత సంస్థలకు సంబంధించిన వాట్సాప్ ఖాతాలపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ట్విటర్‌ను తాలిబన్లు యథేచ్ఛగా వాడుతున్నారు. ఇటీవల ఆఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్న విషయాన్ని తాలిబన్ ప్రతినిధి ట్విటర్ వేదికగానే ప్రకటించారు.