Facebook: ఈ సర్వే ప్రకారం ఫేస్‌బుక్ ఒక వరస్ట్ కంపెనీ

యాహూ ఫైనాన్స్ (Yahoo Finance) సర్వే ప్రకారం.. ప్రపంచంలోని బెస్ట్, వరస్ట్ కంపెనీల గురించి ఇలా వెల్లడించింది. ప్రస్తుతం మెటాగా పిలుస్తున్న ఫేస్‌బుక్ వరస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ గా..

Facebook: ఈ సర్వే ప్రకారం ఫేస్‌బుక్ ఒక వరస్ట్ కంపెనీ

Meta

Facebook: యాహూ ఫైనాన్స్ (Yahoo Finance) సర్వే ప్రకారం.. ప్రపంచంలోని బెస్ట్, వరస్ట్ కంపెనీల గురించి ఇలా వెల్లడించింది. ప్రస్తుతం మెటాగా పిలుస్తున్న ఫేస్‌బుక్ వరస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ గా చెత్త రికార్డు మూటగట్టుకుంది. రన్నరప్ గా నిలిచిన చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా కంటే 50శాతం ఓట్లు వరస్ట్ కంపెనీగా పేరు దక్కించుకుంది.

యాహూ ఫైనాన్స్ హోం పేజి కింద.. సర్వే మంకీ నిర్వహించింది. డిసెంబర్ 4, డిసెంబర్ 5తేదీల్లో వెయ్యి 541మంది అందులో పాల్గొన్నారు. వారంతా అలా ఓటింగ్ వేయడానికి కారణం ఫ్రీ స్పీచ్ పోలీస్ లా కనిపిస్తుండటమే. అనుకున్నది యథాతథంగా ప్లాట్ ఫాంపై కమ్యూనికేట్ చేయలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు.

ఇన్‌స్టాగ్రామ్ పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని అంటుంటే, ఫేస్‌బుక్ అతివాద కామెంట్లను ప్రోత్సహిస్తుందని మరొకరు ఆరోపిస్తున్నారు. కంపెనీ తన బెస్ట్ ఇవ్వలేకపోతుందని సర్వేలో పాల్గొన్న అభ్యర్థులు చెబుతున్నారు. అయితే పదిలో కేవలం ముగ్గురు మాత్రమే తప్పుల నుంచి పాఠాలు తెలుసుకుంటుందనే నమ్మకాన్ని కనబరుస్తున్నారు.

Panama Papers Case: ఐశ్వర్యరాయ్‌కు ఈడీ సమన్లు