Facebook suspends Trump: ట్రంప్‌ను 2023వరకూ సస్పెండ్ చేసిన ఫేస్‌బుక్

Facebook suspends Trump: ట్రంప్‌ను 2023వరకూ సస్పెండ్ చేసిన ఫేస్‌బుక్

Facebook Suspends Trump Until 2023 Shifts Rules For World Leaders

Facebook suspends Trump: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను 2023 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు ఫేస్‌బుక్ అనౌన్స్ చేసింది. ఆ ప్లాట్ ఫాంపైన రూల్స్ బ్రేక్ చేసిన వరల్డ్ లీడర్లను ఇలానే ట్రీట్ చేస్తామని పేర్కొంది. వయోలెన్స్ కారణమయ్యాడని జనవరి 6 తర్వాతి రోజునే ట్రంప్ అకౌంట్‌ను ఫేస్‌బుక్ సస్పెండ్ చేసింది.

పబ్లిక్ సేఫ్టీ రీత్యా ఎటువంటి రిస్క్ లేదని తెలిశాకే ఫేస్‌బుక్ బ్యాన్‌ను రద్దు చేస్తుంది. అప్పటి వరకూ దాదాపు రెండేళ్ల పాటు ఈ నిషేదాన్ని భరించాల్సిందే. ఈ సెన్సార్‌షిప్ కారణంగా తీసుకున్న నిర్ణయం తన ఓటర్లను అవమానించినట్లుగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్ ను ట్విట్టర్ శాశ్వతంగా నిషేదించడంతో ఓ బ్లాగ్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. తన సొంత ప్లాట్ ఫాంపై భావాలను పంచుకునే పనిలో ఉన్నారు ట్రంప్.

ఫేస్ బుక్ నిర్ణయం 75మిలియన్ మందిని అవమానించినట్లే. 2020 ఎన్నికల్లో మాకోసం ఓట్లు వేసిన వాళ్లను కించపరిచారు. సెన్సార్ చేసి, సైలెన్స్ గా ఉండాలని చెప్పి ఏం చేయలేరు. చివరకు మేమే గెలుస్తాం. దీన్ని సహించం’

‘ఈ సారి నేను వైట్ హౌజ్ లో ఉన్నప్పుడు మార్క్ జూకర్ బర్గ్, అని భార్యకు ఎటువంటి డిన్నర్ లాంటి ఏర్పాట్లు ఉండవు’ అని ట్రంప్ ఛాలెంజ్ చేశారు.