ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రాం సరిగా పని చేయట్లేదు 

  • Published By: chvmurthy ,Published On : April 14, 2019 / 01:56 PM IST
ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రాం సరిగా పని చేయట్లేదు 

ఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ ఫాంలైన ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రాం ఆదివారం సాయంత్రం నుంచి సరిగా పని చేయటంలేదని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు.  భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4గంటలనుంచి ఫేస్ బుక్ డెస్క్ టాప్ వెర్షన్ లో సమస్యలు తలెత్తాయి.  రీఫ్రెష్ కాకపోవటం, ఒక్కసారిగా ఆగిపోవటం, వీడియో లోడు అవటానికి చాలా సమయం తీసుకోవటం వంటి సమస్యలను వినియోగదారులు ఎదుర్కోంటున్నారు. వాట్సప్ లోనూ మెసెజ్ లు చేరక పోవటంతో  వినియోగాదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఫేస్ బుక్ మెసెంజర్ దాదాపు 2 గంటల పాటు పని చేయలేదు.  సమస్యను గుర్తించిన పేస్ బుక్  యాజమాన్యం సమస్యను  సరిదిద్దటంతో  ప్రస్తుతం ఇవన్నీ సరిగా పనిచేస్తున్నాయి.  కానీ దాదాపు 9వేల మంది తమ సమస్యను ట్విట్టర్ ద్వారా చెప్పుకున్నారు. 

సరిగ్గా నెల రోజుల క్రితం అంటే మార్చి 13, 2019 న కూడా ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. మళ్లీ తిరిగి పనిచేశాయి. ఆదివారం ఏప్రిల్ 14నాడు కూడా ఇలాంటి సమస్యే తలెత్తటంతో సోషల్ మీడియాకు అలవాటు పడిన ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు.