Facebook ఆఫర్.. FB అకౌంట్లు వాడటం మానేస్తే డబ్బులు చెల్లిస్తుందంట!

  • Published By: sreehari ,Published On : September 8, 2020 / 09:37 PM IST
Facebook ఆఫర్.. FB అకౌంట్లు వాడటం మానేస్తే డబ్బులు చెల్లిస్తుందంట!

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తమ యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కొన్ని రోజులు FB అకౌంట్లు వాడటం మానేస్తే.. డబ్బులు చెల్లిస్తుందంట.. ఫేస్ బుక్ అకౌంట్లు కొన్నిరోజులు యూజర్లు వాడకుండా ఉంటే 120 డాలర్ల వరకు (రూ.8,852)వరకు చెల్లిస్తుందంట.. అదేంటీ ఫేస్ బుక్ డబ్బులు చెల్లించడమేంటి? అనుకుంటున్నారా? ఏమి లేదండీ.. అమెరికాలో ఎన్నికలు 2020 వస్తున్నాయి కదా.. సోషల్ మీడియాలో పొలిటికల్ యాడ్లపై నిషేధం విధించనుంది.



సోషల్ ప్లాట్ ఫాంలో ఎన్నికలకు ముందు వారంలో కొత్త రాజకీయ ప్రకటనలను నిషేధిస్తున్నట్లు ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గత గురువారం ప్రకటించారు కూడా.. మాములుగా ఫేస్ బుక్ లాగిన్ కావొద్దంటే ఎవరైనా వింటారా? అందుకే ఫేస్ బుక్ ఈ ఆఫర్ తీసుకొచ్చింది.. అమెరికాలో ఎన్నికలకు ముందు ఎవరైతే ఫేస్ బుక్ అకౌంట్లలో లాగిన్ కాకుండా ఉంటారో ఆయా యూజర్లకు సోషల్ దిగ్గజం డబ్బులు చెల్లిస్తుంది.



నవంబర్ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఫేస్ బుక్ వెబ్ సైట్, ఇన్ స్టాగ్రామ్‌లను వినియోగించొద్దని సూచిస్తోంది. అలా ఉన్నవారికి డబ్బులు చెల్లిస్తానని చెబుతోంది.. ఎన్నికల్లో ఓటింగ్‌పై సోషల్ మీడియా ప్రభావాన్ని అంచనా వేయనుంది. సెప్టెంబర్ చివరి నుంచే యూజర్లను తమ అకౌంట్లను డియాక్టివేట్ చేయాలని సూచిస్తోంది..



అందరికి కాదండోయ్.. ఫేస్ బుక్ ఎంపిక చేసిన యూజర్లేనంట.. వారికి 120 డాలర్ల వరకు చెల్లిస్తామంటోంది.. ఫేస్ బుక్ అందించే ఈ ఆప్షన్ యూజర్లలో ఎవరైనా ఎంచుకుంటే.. వారు కొన్ని సర్వేలను పూర్తి చేయాల్సి ఉంటుంది.. కొంతకాలం పాటు FB లేదా IG అకౌంట్లను డియాక్టివేట్ చేయాల్సి ఉంటుంది..

అలా చేసినవారికి పరిహారం కూడా చెల్లిస్తామని ఫేస్ బుక్ ప్రతినిధి Liz Bourgeois ట్వీట్ చేశారు. సిలికాన్ వ్యాలీ దిగ్గజం ఫేస్ బుక్ నిర్వహించే ఈ అధ్యయనంలో 2 లక్షల యూజర్ల నుంచి 4 లక్షల యూజర్లు పాల్గొంటారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.



అమెరికాలోని ప్రజాప్రతినిధులు, శాస్త్రీయ శాంపిల్స్ ఎంపిక చేసి అధ్యయనంలో పాల్గొనడానికి ఆహ్వనిస్తారు. కొంతమంది పాల్గొనేవారు ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో నోటీసును ఉంచుతారు. ఈ అధ్యయనంలో పాల్గొనమని యూజర్లను ఆహ్వానిస్తున్నారని ఫేస్‌బుక్ తెలిపింది. ఈ అధ్యయనం ఫలితాల్లో వచ్చే ఏడాది ఎప్పుడైనా విడుదల కావొచ్చు.. ఈ అధ్యయనాన్ని ఇండిపెండెంట్ డేటా సైంటిస్టులు నిర్వహిస్తారని కంపెనీ అధికారులు తెలిపారు.