కొత్త కరోనా స్ట్రెయిన్ : బ్రిటన్‌లో కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు

కొత్త కరోనా స్ట్రెయిన్ : బ్రిటన్‌లో కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు

UK imposes Strict Lockdown : కొత్త రకం కరోనా వ్యాప్తితో బ్రిటన్ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. డిసెంబర్ 26 నుంచి బ్రిటన్‌లో కఠినతరమైన లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. క్రిస్మస్ సెలబ్రేషన్ల కోసం ఆశగా ఎదురుచూసిన బ్రిటన్లకు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. కరోనా కొత్త రకం వైరస్ వ్యాప్తితో అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కఠినతరమైన లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉండటంతో బ్రిటన్ వాసులంతా ఇళ్లల్లోనే గడుపుతున్నారు. ముఖ్యంగా ఈస్ట్, సౌత్‌ ఈస్ట్‌ ఇంగ్లండ్‌లోని దాదాపు 60 లక్షల మంది బ్రిటన్ వాసులపై కరోనా ఆంక్షలు విధించారు. ఇప్పటివరకూ కరోనా మరణాల సంఖ్య 70వేలుపైగా దాటేశాయి.

ఇక స్కాట్లాండ్, నార్తర్న్‌ ఐర్లాండ్‌లలో కొత్త కరోనా కేసులు వేగంగా వ్యాప్తిస్తున్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఈ కఠినతరమైన ఆంక్షలను విధించింది. అత్యవసరాలు మినహా అనవసరమైన అన్నింటిని మూసివేశారు. పౌరులను ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం సూచించింది. లండన్ సహా ఇంగ్లండ్ లోని అనేక ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చేశాయి.

క్రిస్మస్ పండుగకు ముందు రోజు నుంచే ఈ ఆంక్షలను విధించారు. నార్తర్న్ ఐర్లాండ్‌లో ఆరు వారాల లాక్ డౌన్ ప్రకటించారు. బార్లు, రెస్టారెంట్లు, జిమ్స్, బ్యూటీ సెలూన్లు అన్ని మూత పడ్డాయి. టేక్ అవే మాత్రమే అనుమతి ఉంది. ఈ కొత్త స్ట్రెయిన్ వ్యాప్తితో మరణాల రేటు అధికంగా ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇటీవలే ఇంగ్లాండ్ లో టైర్ 4 లాక్ డౌన్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.