వయాగ్రా కలిపిన నీళ్లు తాగిన గొర్రెలు….ఏం జరిగిందంటే!

  • Published By: venkaiahnaidu ,Published On : December 13, 2019 / 02:38 AM IST
వయాగ్రా కలిపిన నీళ్లు తాగిన గొర్రెలు….ఏం జరిగిందంటే!

దక్షిణ ఐర్లాండ్‌లో జరిగినట్టుగా ప్రచారమవుతున్న ఓ ఆశ్చర్యకర కథనం చాలామందిని నోరెళ్లబెట్టేలా చేసింది. అయితే ఆ కథనం కేవలం కల్పితమేనన్న విషయం వెలుగుచూసింది. ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్ ఆ కల్పిత కథనాన్ని ప్రచురించగా.. చాలా వెబ్ సైట్ లు దాన్ని ప్రచురించాయి. 

ఆ కథనం ప్రకారం…దక్షిణ ఐర్లాండ్‌లోని ఓడరేవులో ఓ కెమికల్ కంపెనీ శుద్ది చేయని వయాగ్రా మాత్రలను టన్నులకొద్ది విడుదల చేసింది. ఆ తర్వాత అక్కడి నీళ్లు తాగిన ఓ గొర్రెల మందలో విచిత్ర ప్రవర్తన మొదలైంది. ఉన్నట్టుండి గొర్రెలన్నీ తోడు కోసం తపించడం మొదలుపెట్టాయి. వయాగ్రా కలిసిన నీటిని తాగడం వల్లే గొర్రెలు లైంగిక ఉత్తేజం పొందాయి. దాదాపు ఒక వారం పాటు అవిసెక్స్ కోసం తపించిపోయాయి. సుదీర్ఘ స్తంభనలతో పిచ్చెక్కిపోయాయని ఆ కథనంలో ఉంది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

అయితే ఇందులో నిజం లేదని.. ఓ సెటైరికల్ వెబ్‌సైట్ కావాలనే ఇలాంటి కథనాన్ని పబ్లిష్ చేసిందని, ఆ తర్వాత మరికొన్ని న్యూస్ ఛానళ్లు కూడా దీన్ని ఫాలో అయ్యాయని సదరు ఫార్మా కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఓడరేవులో 755 టన్నుల వయాగ్రా మాత్రలను డంప్ చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించింది ఫార్మా కంపెనీ.