Fake vaccination : టీకా వేయకుండానే వేసినట్టు నటించిన నర్సు

ఓ నర్సు వ్యాక్సిన్ వేయించుకోవటానికి వచ్చిన వ్యక్తికి టీకా వేసినట్లుగా నాటకమాడింది. సూదిని సదరు వ్యక్తికి భుజనాకి గుచ్చింది గానీ వ్యాక్సిన్ ఇంజెక్ట్ మాత్రం చేయకుండానే సిరంజ్ ను తీసివేసింది. కానీ అదేమీ తెలియని వ్యక్తి తనకు టీకా వేశారనుకున్నాడు. మరి ఈ విషయం తెలిసాక అసలు వ్యాక్సిన్ వేస్తున్నారా? లేదా నటిస్తున్నారా? అనే డౌట్ రాకుండా ఎలా ఉంటుంది? ఈ వార్తకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారేసరికి జనాలంతా వైద్య సిబ్బందిని తిట్టి తిట్టిపోస్తున్నారు.

Fake vaccination : టీకా వేయకుండానే వేసినట్టు నటించిన నర్సు

Fake Corona Vaccination

Fake corona vaccination : మోసాలు ఆయా సీజన్ల డిమాండ్ ను బట్టి మారిపోతున్నాయి. కరోనా వ్యాక్సిన్ విషయంలో జరిగే మోసాలకు అంతులేకుండాపోతోంది. కరోనా మహమ్మారిని ఖతం చేయటానికి వచ్చిన టీకాలో జరుగుతున్న మోసాలు ఇప్పుడు ప్రజలకు పెను అనుమానాలకు దారి తీస్తోంది. వ్యాక్సిన్ వేయించుకోవటానికి వెళితే వైద్య సిబ్బంది నిజంగానే వ్యాక్సిన్ వేస్తున్నారా? లేక సూది గుచ్చి వ్యాక్సిన్ వేసినట్లుగా నాటకాలు ఆడుతున్నారా? అనే ప్రశ్న మొదలైంది.



ఓ ఘటన గురించి వింటుంటే..అదేమంటే..ఓ నర్సు వ్యాక్సిన్ వేయించుకోవటానికి వచ్చిన వ్యక్తికి టీకా వేసినట్లుగా నాటకమాడింది. సూదిని సదరు వ్యక్తికి భుజనాకి గుచ్చింది గానీ వ్యాక్సిన్ ఇంజెక్ట్ మాత్రం చేయకుండానే సిరంజ్ ను తీసివేసింది. కానీ అదేమీ తెలియని వ్యక్తి తనకు టీకా వేశారనుకున్నాడు. మరి ఈ విషయం తెలిసాక అందరికీ అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? ఈ వార్తకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారేసరికి జనాలంతా వైద్య సిబ్బందిని తిట్టి తిట్టిపోస్తున్నారు. ఈ వైరల్ వీడియో చూసినవారంతా..జనాలు కరోనాతో ఛస్తుంటే ఈ కుక్కుర్తి వేషాలేంటీ? ఇటువంటి మోసాలు చేయటానికి సిగ్గులేదా? అని తిట్టిపోతున్నారు.

వ్యాక్సిన్ తీసుకునేందుకు ఓ వ్యక్తి కూర్చున్నాడు. అతడి ఎడమ చేతి భుజానికి టీకా వేసేందుకు నర్స్ సిద్ధమైంది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న వ్యక్తి భుజంమీద కాటన్‌తో క్లీన్ చేసింది. ఆ పై టీకా ఉన్న సిరంజిని అతడి చేతికి గుచ్చి వెంటనే తీసేసింది. మందును మాత్రం ఇంజక్ట్ చేయలేదు. లబ్ధిదారుడు మాత్రం తాను టీకా తీసుకున్నట్టే భావించాడు. టీకా పేరుతో జరుగుతున్న మోసాలను ఈ వీడియో కళ్లకు కడుతోంది.



మెక్సికోలోని నేషనల్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్‌లోని నేషనల్ స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్‌లో ఒక వృద్ధుడికి కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇచ్చినట్లు నర్స్ నటిస్తున్నట్లుగా నటించింది. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైలర్ గా మారింది. కాగా..సదరు నర్సు చేసిన పనికి మెక్సికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ (IMSS) ఆ నర్సును డ్యూటీ నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది.