Australia : రూ. వేల కోట్లు కుమ్మరించినా ఆ ఇంటిని అమ్మమంటున్నారు.. కారణం

కష్టపడి కొన్న భూమిపై ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది. అయితే కొందరు చాలా లాభపడతామనుకుంటే విక్రయించడానికి వెనుకాడరు. కానీ ఆస్ట్రేలియాలో ఓ కుటుంబం వేల కోట్లు చెల్లిస్తామన్నా ససేమిరా అంది. ప్రలోభానికి లొంగని ఆ కుటుంబంపై ప్రశంసలు జల్లు కురుస్తోంది.

Australia : రూ. వేల కోట్లు కుమ్మరించినా ఆ ఇంటిని అమ్మమంటున్నారు.. కారణం

Australia

family refused to sell the house : ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల ఉంటుంది. ఆ కల నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడతారు. ఎప్పుడైనా అమ్మాల్సి వస్తే అనే ఆలోచననే భరించలేరు. ఆస్ట్రేలియాలో ఓ కుటుంబం తమ 5 ఎకరాల భూమిని అమ్మడానికి ససేమిరా అంది. ప్రాపర్టీ డెవలపర్స్ వేల కోట్లు చెల్లిస్తామన్నా తిరస్కరించింది.

Strange incident : కారులోంచి కోట్ల రూపాయలు విసిరేసిన వ్యక్తి.. ఇక రోడ్డుపై పరిస్థితి ఎలా ఉంటోందో ఊహించండి…

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నివాసం ఉంటోంది జమ్మిట్ కుటుంబం. వీరి ఇల్లు ఇంటి చుట్టూ ఉండే స్థలం ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే ఇక్కడ ఉండే అన్ని ఇళ్లలోకి వీరి ఇల్లు ప్రత్యేకంగా కనిపిస్తుంది. 5 ఎకరాల స్థలంలో తమ ఇంటిని నిర్మించుకున్నారు. ఇటీవల కాలంలో వీరి ఇంటిపై ప్రాపర్టీ డెవలపర్స్ కన్ను పడింది. తమకు విక్రయించాల్సిందిగా $50 మిలియన్ (₹4,139,393,300.00 భారతీయ కరెన్సీలో) ఆఫర్ కూడా ఇచ్చారు. అయితే అంత మొత్తం ఇచ్చినా తమ ఇంటిని విక్రయించేది లేదని జమ్మిట్ కుటుంబం స్పష్టం చేసింది. వారి ఇరుగుపొరుగు వారు తమ భూమిని హౌసింగ్ డెవలపర్స్‌కి అమ్మడానికి అంగీకరించినా జమ్మిత్ కుటుంబం వారి ప్రలోభాలకు లొంగకుండా విక్రయించడానికి తిరస్కరించింది.

Farmer Dream House : ఓడ ఆకారంలో ఇల్లు.. 13 ఏళ్లైనా పూర్తి కాని ఓ రైతు కలల సౌధం.. కారణం ఏంటంటే?

జమ్మిట్ ఇంటిని చూస్తే న్యూయార్క్‌లో సెంట్రల్ పార్క్‌కి ప్రతిరూపంలా కనిపిస్తుంది. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతం ఇంతకంటే అందంగా ఉండేదట. ఇక జమ్మిట్  ప్రాపర్టీని చైనాలోని ప్రసిద్ధి చెందిన నెయిల్ హౌస్‌లతో పోలుస్తారు.