కడుపులోకి దూసుకెళ్లిన రాకెట్ : వేదికపైనే సింగర్ సజీవదహనం

ఒక సంగీత కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మ్యూజికల్‌ షోలో ప్రముఖ స్పానిష్‌ పాప్‌స్టార్‌, డాన్సర్‌ జోయానా సెయిన్స్‌ దుర్మరణం పాలయ్యారు.

  • Published By: veegamteam ,Published On : September 3, 2019 / 07:50 AM IST
కడుపులోకి దూసుకెళ్లిన రాకెట్ : వేదికపైనే సింగర్ సజీవదహనం

ఒక సంగీత కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మ్యూజికల్‌ షోలో ప్రముఖ స్పానిష్‌ పాప్‌స్టార్‌, డాన్సర్‌ జోయానా సెయిన్స్‌ దుర్మరణం పాలయ్యారు.

ఒక సంగీత కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మ్యూజికల్‌ షోలో ప్రముఖ స్పానిష్‌ పాప్‌స్టార్‌, డాన్సర్‌ జోయానా సెయిన్స్‌ దుర్మరణం పాలయ్యారు. సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా  బృందంతో కలిసి  ప్రదర్శన ఇస్తుండగా బాణా సంచా పేలింది. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కర్టెన్ లాగడానికి ముందే నేల మీద పడటంతో సుమారు 1,000 మంది ప్రేక్షకులు భయానకంగా చూశారు. 

బాణాసంచా కాల్చుతున్న సందర్భంగా..  ప్రమాదవశాత్తూ రెండు రాకెట్లు వేదికపై దూసుకు వచ్చాయి. ఒకటి ఏకంగా ఆమె కడుపులోకి దూసుకుపోయింది. దీంతో వేదిక మీద ఒక్కసారిగా పేలుడు, సంభవించి మంటలంటుకోవడంతో ఆ మంటల్లో జోయానా చిక్కుకు పోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను ఆస్పత్రికి తరలించే సమయానికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఓ ప్రమోటర్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ఆమెకు నివాళి అర్పించారు. అతను 15 బలమైన సమూహానికి ప్రధాన కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు.

Also Read : విడుదలయ్యే వరకు గడ్డం గీసుకోనని మాజీ సీఎం ప్రతిజ్ఞ