cow giving birth in wedding : యజమాని పెళ్లిలో ప్రసవించిన ఆవు…అదృష్టం అని మురిసిపోతున్న జంట

cow giving birth in wedding : యజమాని పెళ్లిలో ప్రసవించిన ఆవు…అదృష్టం అని మురిసిపోతున్న జంట

Cow Giving Birth In Wedding

cow giving birth in wedding  : ఆవు..హిందూ సంప్రదాయంలో ఆవును సాక్షాత్తూ లక్ష్మీదేవిగా కొలుస్తాం. గృహప్రవేశాలకు ఆవు..దూడ ఉండాల్సిందే. కొత్త ఇంటిలోకి ఆవు దూడలను వెంటబెట్టుకుని ప్రవేశిస్తాం. అలాగే పెళ్లి వేడుకలో కూడా వధువుతో ఆవుకు పూజలు చేయిస్తారు. ఇలా ప్రతీ శుభకార్యాలకు ఆవులను కొలుచుకుంటాం. అటువంటి ఆవు తన యజమాని పెళ్లిలో వధువు వేసుకున్న డ్రెస్ ను మురికి మురికి చేసేసింది. కానీ వాళ్లు ఏమాత్రం ఆ ఆవుపై కోప్పడలేదు. పైగా ఎంతగా వధూ వరులతో పాటు అందరూ ఎంతగానో సంతోషించిపోయారు. ఇది మా అదృష్టం..సాక్షాత్తూ గోమాతే ఆ అమ్మవారిగా వచ్చిన మమ్మల్ని ఆశీర్వదించింది అంటూ మురిసిపోయారు కొత్త జంట. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట పెళ్లిలో అంతా పాడి పంటలే కనిపించే ఆ విశేషాలు తెలుసుకోవాల్సిందే.

33

ఆస్ట్రేలియాలోని పోర్ట్‌లాండ్‌కు చెందిన 32 ఏళ్ల జెస్సా లాస్‌, 38 ఏళ్ల బెన్ లాస్‌లు ఇద్దరూ రైతులు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవానికి అన్నీ కార్యక్రమాలు చేసుకున్నారు. స్నేహితులు, బంధువులు అంతా వచ్చారు. వాళ్లిద్దరూ రైతులు కాబట్టి తమ పొలంలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అలా పోర్ట్‌లాండ్‌కు దగ్గర్లో ఉన్న గొరే అనే వారి సొంత వ్య‌వ‌సాయక్షేత్రంలో పెళ్లి కోసం ఏర్పాట్లు చేశారు. పెళ్లికి ముందు స్నేహితులు..బంధువులతో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. జెస్సా లాస్‌, బెన్ లాస్‌ల పెళ్లి రిసెప్ష‌న్‌కు చక్కగా ముస్తాబు అయి వేదిక ఎక్కారు. చక్కగా వ్యవసాయ క్షేత్రంలోనే వివాహం చేసుకుని ఓ ఇంటివారు కాబోతున్న వారిని అందరూ అభినందిస్తున్నారు.చక్కటి సందడి వాతావరణంలో అందరూ ఉండగా..అక్కడికి వధూ వరుల పెంపుడు ఆవు ఒకటి ఆ సందడిలోకి వచ్చింది.ఆ ఆవు పేరు ‘ఫ్లియ‌స్ జ‌కోట్ డ్రామా. అది అప్పటికే గర్భవతి.

As

ఆ రిసెస్షన్ కార్యక్రమం మధ్యలోకి వచ్చి అతిథుల సమక్షంలోనే ఆ ఆవు దూడకు జన్మనిచ్చింది (ఈనింది). కాగా ఆ ఆవు కొన్ని రోజుల ముందే ప్ర‌స‌వించాల్సి ఉంది. పెళ్లి రోజు కూడా రోజంతా ఈ రైతు జంట ఆ ఆవు ఈనుతుందేమోనని గ‌మ‌నిస్తూనే ఉన్నారు. కానీ ఈనలేదు. ఈ క్రమంలో వారి వివాహానికి కొద్ది సమయం ముందు ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమంలోకి ఎలా వచ్చిందో గానీ వచ్చి మొత్తానికి దూడను ప్రసవించింది. Des

ఈ ప్రసవంలో దూడతో పాటు ఆకడుపులోంచి బైటపడిన కొన్ని వ్యర్థాలు వధువు వెడ్డింగ్ డ్రెస్ పై పడి మురికి మురికి అయ్యింది. కానీ వధూ వరులిద్దరూ ఆ ఆవుకు తాము పెట్టిన పేరుకు తగినట్లుగా నిజంగా పెద్ద ‘డ్రామా’ క్రియేట్ చేసిందనీ..ఇదంతా తమ అదృష్టమని మురిసిపోయారు. జెస్సా. రిసెప్షన్ రోజు రాత్రి 7 గంట‌ల‌కు, అతిథులు మాట్లాడుతున్న స‌మ‌యంలో డ్రామా అందమైన దూడను ప్ర‌స‌వించింది. ఆవు ప్రసవిస్తుంటే దగ్గరకు వెళ్లిన పెళ్లికూతురు వెడ్డింగ్ గౌను పూర్తిగా పాడైపోయింది. ఇది మా అదృష్టమని ఆవు మమ్మల్ని ఇలా ఆశీర్వదించిందని మురిసిపోయార జంట. తమ జీవితంలో ఇది మ‌ర‌చిపోలేని సంఘ‌ట‌న‌గా నిలిచిపోతుంద‌ని నవ దంపతులు సంతోషాన్ని వ్యక్తంచేశారు.

Res

వీరితో పాటు వేడుకలకు హాజరైన కొందరు వ్యక్తులు ఆవుకు ప్రసవంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా సాయం చేశారు. లేగదూడకు `డెస్టినీ` అని పేరు పెట్టారు. మూడేళ్ల క్రితం ఒక ప‌బ్‌లో మొద‌టిసారి జెస్సా, బెన్ క‌లిశారు. ఆవుల గురించి మాట్లాడుకోవ‌డంతోనే వీరి బంధం బ‌ల‌ప‌డి పెళ్లి చేసుకునేవరకూ వచ్చింది. అలా వారికి ఆవుల మీద ఉన్న మరోసారి రుజువైంది వారి వివాహంలో ఆవు వచ్చి ప్రసవించటంతో ద్వారా.