బ్రేకింగ్ : పాక్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిన FATF

  • Published By: madhu ,Published On : August 23, 2019 / 06:41 AM IST
బ్రేకింగ్ : పాక్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిన FATF

అంతర్జాతీయంగా పాక్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. తీవ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను అడ్డుకోవడంలో విఫలమైందంటూ..పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టింది అఫిలియేటెడ్ ఆఫ్ ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్. తీవ్రవాదులకు నిధులను సరఫరా అడ్డుకోవాలని..గతంలోనే ఎఫ్‌టీఎఫ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో ఆ దేశానికి మరిన్ని ఇబ్బందులు వస్తాయని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పాక్‌కు ఆర్థిక సాయం చేసేందుకు నిరాకరించాయి పలు అంతర్జాతీయ సంస్థలు. 

అక్రమ నగదు చలామణి, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేసే పనిని పూర్తి చేయని పాక్, ఇరాన్‌లపై ఇటీవలే FATF ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్‌లోగా తగిన చర్యలు తీసుకోకపోతే బ్లాక్ లిస్టులో పెడుతామని హెచ్చరించింది. దేశంలో నిషిద్ధ ఉగ్రవాద సంస్థళ కార్యాకలాలను పాక్ గుర్తించి ఉగ్రవాదాన్ని అరికట్టాలని సూచించింది. ఇందుకు పట్టిష్ట చట్టాలు లేని దేశాలను గ్రే లిస్టులో ఉంచింది ఎఫ్ఏటీఎఫ్. ఆ జాబితాలో పాక్‌ను గత ఏడాది చేర్చింది. పాక్ జనవరి నాటికే కాకుండా..మే పూర్తయినా..తన కార్యాచరణ ప్రణాళికను పూర్తి చేయలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. 

FATF అంటే : – 
పారీస్ కేంద్రంగా పనిచేస్తున్న FATF ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా..అక్రమ నగదు చలామణిని అరికట్టడానికి కృషి చేస్తోంది. 36 ఓటు హక్కు గల దేశాలు, రెండు ప్రాంతీయ సంస్థలను కలిగి ఉంది ఎఫ్ఏటీఎఫ్. ప్రధాన ఆర్థిక కేంద్రాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. వచ్చే ఏడాది ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్ష పదవిని చైనా దక్కించుకుంది. గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సౌదీ అరేబియా..ఈ సంస్థలో శాశ్వత సభ్య దేశంగా చేరనుంది. పాక్ వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్, యూరప్, బ్రిటన్‌లు గళమెత్తాయి. టర్కీ మాత్రం పాక్‌కు అండగా నిలిచింది.