World News | International News | Latest World News in telugu | Breaking International News - 10TV.in

AI Vaccine : వైద్య రంగంలో కొత్త విప్లవం.. ఏఐ సాయంతో వ్యాక్సిన్.. ఇక, ఏ వైరస్‌లు మనల్ని ఏమీ చేయలేవు..! ఎలా పనిచేస్తుందంటే?
వైద్య రంగంలోకి కొత్త విప్లవం

ఏఐ రూపొందించిన ప్రపంచపు తొలి వ్యాక్సిన్

ఇక, ఏ వైరస్‌లు మనల్ని ఏమీ చేయలేవు..!

AI Vaccine : వైద్య రంగంలో కొత్త విప్లవం ప్రారంభమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైద్యరంగంలో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఏఐ సహాయంతో రూపొందించిన వ్యాక్సిన్ మానవ పరీక్షల దశలోకి అడుగు పెట్టింది. అనేక రకాల వైరస్‌ల నుంచి రక్షణ కల్పించగల, మహమ్మారిలను అడ్డుకోగల ఓ కొత్త వ్యాక్సిన్‌ను ఏఐ ఉపయోగించి అభివృద్ధి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, ఇది భవిష్యత్తులో వ్యాక్సిన్ అభివృద్ధి విధానాన్ని పూర్తిగా మార్చగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Also Read : Sahara Desert Tragedy : ఘోర విషాదం.. ఎడారిలో చెడిపోయిన ట్రక్కు.. నీరు దొరక్క 49 మంది మృతి..

సాంప్రదాయ పద్దతుల్లో ఒక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి సాధారణంగా అనేక సంవత్సరాలు పడుతుంది. వైరస్‌ను గుర్తించడం, దానికి వ్యతిరేకంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని ఎలా ప్రేరేపించాలనే అంశాలను అధ్యయనం చేయడం, ప్రయోగాలు, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం వంటి ప్రక్రియలకు చాలా సమయం పడుతుంది. కానీ, ఏఐ సహాయంతో వ్యాక్సిన్‌ను వేగంగా తయారు చేసే అవకాశం ఉంటుంది.

వివరంగా చెప్పాలంటే.. సాధారణంగా ఒక వైరస్ వ్యాప్తి చెందిన తరువాతే ఆ వైరస్‌ను కట్టడి చేసేందుకు విరుగుడుగా వ్యాక్సిన్ తయారు చేస్తారు. కానీ, ఈ కొత్త పరిశోధనల్లో ఏఐ అల్గారిథమ్‌లను ఉపయోగించారు. ఈ ఏఐ వ్యవస్థ ప్రకృతిలో ఉన్న వివిధ రకాల వైరస్‌ల జన్యు క్రమాలను, అవి ఎలా పరిణామం చెందుతాయో ముందే విశ్లేషిస్తుంది. ఈ విశ్లేషణ ఆధారంగా, భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న వైరస్‌ల నిర్మాణాన్ని ఏఐ ముందే ఊహించి, దానికి సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యాక్సిన్ డిజైన్‌ను కంప్యూటర్‌లోనే సిద్ధం చేస్తుంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే..? ఏఐ వ్యాక్సిన్ కేవలం ఒక నిర్దిష్ట వైరస్ ను మాత్రమే కాకుండా.. ఆ వైరస్ కుటుంబానికి చెందిన అన్ని రకాల వైరస్ లను సమర్ధవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వైరస్‌లు తమ రూపాన్ని మార్చుకున్నప్పటికీ (Variants), ఈ వ్యాక్సిన్ వాటిపై సమాన ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు.

కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ బృందం తెలిపిన వివరాల ప్రకారం.. టీకాకు సంబంధించిన కీలక భాగాన్ని ఏఐ రూపొందించడం, దాన్ని ప్రజలపై ప్రయోగించడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఏఐ సహాయంతో రూపొందించిన టీకా ప్రస్తుతం అభివృద్ధి దశల్లో ఉంది. అయితే, భవిష్యత్తులో కరోనా వైరస్‌ల వివిధ రూపాంతరాలు మాత్రమే కాకుండా, కొత్త మహమ్మారులకు కారణమయ్యే వైరస్‌లను కూడా ఎదుర్కొనే సామర్థ్యం దీనికి ఉండొచ్చునని భావిస్తున్నారు.

ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రొఫెసర్ జొనాథన్ హీనే మాట్లాడుతూ.. ఇన్‌ఫెక్షన్లను గుర్తించి, దానిపై మన శరీరం పోరాడే అవకాశాలను వ్యాక్సిన్లు పెంచుతాయి. అయితే, కొవిడ్, చలికాలంలో సోకే ప్లూలకు సంబంధించిన వ్యాక్సిన్లను నిరంతరం అప్‌డేట్ చేస్తుండాలి. మనం ఎప్పుడూ వైరస్‌ల కంటే ఒక అడుగు వెనకబడే ఉంటున్నాం. దాన్ని అధిగమించేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం. కొత్తగా వృద్ధిచెందే వైరస్‌లను, భవిష్యత్ మహమ్మారుల నుంచి రక్షించగల వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని తెలిపారు

Sahara Desert Tragedy : ఘోర విషాదం.. ఎడారిలో చెడిపోయిన ట్రక్కు.. నీరు దొరక్క 49 మంది మృతి..
సహారా ఎడారిలో ఘోర విషాదం

ఆగిపోయిన ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు

తాగేందుకు నీరు దొరక్క 49మంది మృతి

Sahara Desert Tragedy : సహారా ఎడారిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు ఎడారిలో చిక్కుకుపోయింది.. దీంతో రోజుల తరబడి ఎడారిలో ఉండటంతో విపరీతమైన వేడి, ఉక్కపోతతోపాటు నీటి చుక్క దొరక్క ట్రక్కులో ప్రయాణిస్తున్న 49మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ట్రక్కులోనే ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడి అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులంతా నైజర్‌ (Niger)కు చెందిన వారని అధికారులు తెలిపారు.

Also Read : Alcohol Prices Increase : మందు బాబులకు షాకింగ్ న్యూస్.. ఫుల్ బాటిల్‌పై 80.. హై-ఎండ్ కాస్ట్‌లీ బ్రాండ్లపై ఏకంగా రూ.120 పెంపు..? అమల్లోకి ఎప్పటినుండంటే?

పశ్చిమ ఆఫ్రికా దేశం నైజర్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో ఈద్ అల్ -ఆధా (బక్రీద్)ను జరుపుకునేందుకు ట్రకులో బయల్దేరారు. అస్సామాకా పట్టణానికి పశ్చిమాన సుమారు 80కిలో మీటర్ల దూరంలో సహారా ఎడారిలోని నిర్జన ప్రాంతంలో ఆ ట్రక్కు నిలిచిపోయింది. ట్రక్కును మరమ్మతు చేయడానికి డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వారు నిలిచిపోయిన ప్రాంతంలో ఎలాంటి గ్రామాలు లేకపోవటం, ఫోన్ సిగ్నల్ కూడా లేకపోవటంతోపాటు తీవ్ర ఉష్ణోగ్రతలు, నీటి కొరత కారణంగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నప్పుడు ట్రక్కు చుట్టూ అనేక మృతదేహాలు కనిపించాయని తెలిపారు.

ట్రక్కులో ప్రయాణిస్తున్న వారిలో ఓ ఇద్దరు నీటికోసం వెతికే ప్రయత్నంలో 50కిలో మీటర్లుకుపైగా నడిచారు. ఆ తరువాత నీరు దొరకే ప్రాంతానికి చేరుకొని.. అక్కడి నుంచి అస్సమాకా పట్టణానికి చేరుకొని అధికారులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. అప్పటికే 49మంది చనిపోయారు. మృతదేహాలను వెలికితీసి ఎడారిలోనే సామూహిక ఖననాలు నిర్వహించారు. విపరీతమైన వేడి, ఉక్కపోత, తాగేందుకు చుక్కనీరు కూడా లేకపోవటంతో వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

సహాయ బృందాలు తిరిగి వస్తున్న క్రమంలో సమీప ప్రాంతంలో మరో ట్రక్కు కూడా చెడిపోయి నిలిచిపోయినట్లు గుర్తించారు. ఆ ట్రక్కులో ప్రయాణిస్తున్న 60మంది మూడు రోజులుగా ఎడారిలో చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. అదృష్టవశాత్తూ వారికి సమయానికి నీరు అందించి ప్రాణాలు కాపాడగలిగారు.

Ice Mummy: చనిపోయిన శవంలో ‘సజీవ’ సంచలనం.. 5,300 ఏళ్లుగా బతికే ఉన్న బ్యాక్టీరియా.. ఒట్జీ మమ్మీ మరణం లేని మంచు కథ
మంచు మమ్మీలో సజీవంగా ఉన్న ప్రాణం

ఐదు వేల ఏళ్ల నాటి బ్యాక్టీరియా

సైన్స్ ప్రపంచాన్ని ఊపేసిన సరికొత్త ఆవిష్కరణ

Ice Mummy: నిజంగా ఇది విస్మయానికి గురిచేసే విషయమే. శాస్త్రవేత్తల అన్వేషణలకు కాలం ఎప్పుడు సరికొత్త జవాబులు చెప్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది. దాదాపు 5,300 ఏళ్ల క్రితం ఇటాలియన్ ఆల్ప్స్ మంచు పర్వతాల్లో ఒక బాణం తగిలి ఒట్జీ (Otzi Mummy) అనే వేటగాడు ప్రాణాలు కోల్పోయాడు. శతాబ్దాల తరబడి స్తంభించిపోయిన ఆ మంచు సమాధిలో అతని శరీరం ఒక మమ్మీగా మారిపోయింది. అయితే, తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ఒక సంచలన ఆవిష్కరణ మానవ చరిత్రను, సైన్స్ పరిమితులను ఒక్కసారిగా తిరగరాసింది అనే చెప్పాలి.

*Credit Card: పొరపాటున కూడా మీ క్రెడిట్ కార్డును ఈ పనుల కోసం వాడకండి.. లేదంటే అప్పులపాలవ్వడం గ్యారంటీ

ఐదు వేల ఏళ్లు దాటినా, ఆ మంచు మనిషి శరీరంలో ఇప్పటికీ మైక్రోస్కోపిక్ జీవం సజీవంగా స్పందిస్తోందని పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా మరణం తర్వాత శరీరం పూర్తిగా నిర్జీవమైపోతుంది, కానీ ఒట్జీ విషయంలో ఈ ప్రకృతి నియమాలు తలకిందులయ్యాయి. అతని ప్రేగులలోని పూర్వ కాలపు (prehistoric) గట్ బ్యాక్టీరియా, అత్యంత చలిని తట్టుకునే ప్రత్యేక ఈస్ట్ జాతులు (yeast strains) ఇప్పటికీ జీవక్రియలను సాగిస్తూ, జీవంతో కొట్టుమిట్టాడుతున్నాయని వారు కనుకొన్నారు. గడ్డకట్టిన ఆ మంచు పొరల కింద, శతాబ్దాలుగా ఈ సూక్ష్మజీవులు తమ ఉనికిని కాపాడుకుంటూ రావడం సైన్స్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

ఈ ఆవిష్కరణ మానవ పరిణామ క్రమాన్ని, ప్రాచీన కాలపు జీవవైవిధ్యాన్ని అర్థం చేసుకోవడానికి సరికొత్త తలుపులు తెరిచిందని మేధావులు అభిప్రాయ పడుతున్నారు. ఐదు వేల ఏళ్ల నాటి ప్రాచీన సూక్ష్మజీవులు నేటికీ సజీవంగా ఉన్నాయంటే, విశ్వంలో జీవం ఎంతటి కఠిన పరిస్థితులనైనా తట్టుకుని బతకగలదని మరోసారి నిరూపితమైంది. కాల గమనాన్ని తట్టుకుని ఒట్జీ శరీరంలో దాగున్న ఈ ‘సజీవ కాలపు గుళిక’ వైద్య రంగంలో అమరత్వం, జీవ సంరక్షణపై సరికొత్త పరిశోధనలకు ఊపిరి పోస్తోంది.

Donald Trump : భారత్‌కు బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్.. మళ్లీ టారిఫ్ కొరడా..!
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఒకవైపు న్యూఢిల్లీలో అమెరికా – భారత్ వాణిజ్య చర్చలు జరుగుతుండగా.. మరోవైపు అమెరికా భారతదేశ దిగుమతులపై 12.5శాతం అదనపు సుంకాన్ని ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని, ఇంకా ఖరారు కాలేదని కేంద్ర పేర్కొంది. అమెరికా ప్రభుత్వం తాజా చర్య కారణంగా న్యూఢిల్లీలో జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను క్లిష్టతరం చేసే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

Also Read :  Telangana Land value : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ పెంపు.. ఏఏ ప్రాంతంలో ఎంత పెంచారంటే? కొత్త ధరలు రేపటి నుంచే..

తాజా పరిణామాలపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. అమెరికాలో భారతదేశం దిగుమతులపై ప్రతిపాదిత సుంకాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ చర్యపై నిర్ణయం తీసుకునే ముందు యూఎస్‌టీఆర్ ఆయా దేశాల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటుందని పేర్కొంది. సెక్షన్ 301 విచారణలో భాగంగా ఈ విషయంపై భారత్ అమెరికాతో సంప్రదింపులు కొనసాగిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొంది. వెట్టిచాకిరి కార్మిక దిగుమతులపై నిషేధం లేని 54 ఆర్థిక వ్యవస్థల జాబితాలో అమెరికా భారత్ ను కూడా చేర్చింది. అందువల్ల ప్రతిపాదత 12.5శాతం అధిక సుంకాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇండియాతోపాటు 60దేశాలపై కూడా సుంకాల విధింపు ప్రతిపాదన ఉంది.

సెక్షన్ 301 అనేది అమెరికా వాణిజ్య చట్టంలోని ఒక నిబంధన. దీని ద్వారా అమెరికా ప్రభుత్వం ఇతర దేశాల వాణిజ్య విధానాలు అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయా లేదా అనేది విచారించి, అవసరమైతే అదనపు సుంకాలు, ఇతర ఆంక్షలు విధించవచ్చు. నిజంగా ఈ సుంకాలు అమల్లోకి వస్తే.. భారత ఎగుమతులపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అల్యూమినియం, పత్తి, సముద్ర ఆహార ఉత్పత్తులు, కాఫీ, బియ్యం వంటి రంగాలకు అమెరికా మార్కెట్లో పోటీ తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Trump – Netanyahu : ఇదెక్కడి ట్విస్ట్.. నెతన్యాహుని బండబూతులు తిట్టిన ట్రంప్.. నేను రక్షించకపోతే..
Trump – Netanyahu : లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్లు సమాచారం. అదే సమయంలో ఇరాన్‌తో జరుగుతున్న సున్నితమైన చర్చలకు ఈ సంఘర్షణ ఆటంకం కలిగించకుండా వాషింగ్టన్ నివారించేందుకు ప్రయత్నిస్తోంది.

Also Read : Donald Trump Tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్‌లో ఆ పరికరాల తయారీ రంగానికి గుడ్‌న్యూస్.. తగ్గనున్న ధరలు

బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాల్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులకు ఆదేశించండం, దక్షిణ లెబనాన్‌లో భూతల కార్యకలాపాలను విస్తరించడం వంటి చర్యల తరువాత ఈ అసాధారణ ఘర్షణ చోటు చేసుకుంది. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అయితే, లెబనాన్‌పై దాడులుచేస్తే అమెరికాతో చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్ బెదిరించింది. ఈ క్రమంలో నెతన్యాహు తో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది.

నివేదికల ప్రకారం.. ఇజ్రాయెల్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తున్నారని, ఇరాన్ తో అమెరికా దౌత్య ప్రయత్నాలకు ప్రమాదం కలిగిస్తున్నారని ట్రంప్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘నీకు పిచ్చి పట్టింది. నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి. నిన్ను కాపాడుతున్నాను. ఇప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. దీనికారణంగా అందరూ ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తున్నారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అంటూ ట్రంప్ గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. ఇరాన్ విషయంలో ఇన్నాళ్లూ ఒకే వేదికపై కనిపించిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు భిన్న దిశల్లో పయణిస్తున్నట్లు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. ట్రంప్ యుద్ధాన్ని పరిమితం చేసి చర్చల ద్వారా పరిష్కారం కోరుతుండగా.. నెతన్యాహు మాత్రం హెజ్బొల్లాపై సైనిక ఒత్తిడి కొనసాగించాలనే వైఖరితో కనిపిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ వెనక్కు తగ్గుతుందా.. లేదంటే ట్రంప్ ను ధిక్కరించి తన వ్యూహాన్ని అమలు చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

Donald Trump Tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్‌లో ఆ పరికరాల తయారీ రంగానికి గుడ్‌న్యూస్.. తగ్గనున్న ధరలు
డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం

పరికరాల తయారీ రంగానికి శుభవార్త

వాటిపై విధించిన టారిఫ్‌లను 25% నుంచి 15%కు తగ్గింపు

Donald Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు రకాల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పరికరాలపై దిగుమతి సుంకాలను (Tariffs) 10శాతం తగ్గించినట్లు ప్రకటించారు. ఈ తగ్గింపుతో సుంకాలు 25శాతం నుంచి 15శాతానికి తగ్గనున్నాయి. వచ్చే ఏడాది చివరి వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. అమెరికా వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉత్పత్తి దారుల వ్యయాలను తగ్గించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ యంత్రాంగం తెలిపింది. సవరించిన సుంకాల విధానం ఈనెల 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

Also Read – Divvala Madhuri : తెలంగాణ రాజకీయాల్లోకి దివ్వల మాధురి.. పోటీ చేస్తాను అంటూ..

ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లను 50శాతం వరకు పెంచింది. దీంతో అమెరికాలో తయారీ ఖర్చులు పెరిగి రైతులు, నిర్మాణ రంగం, పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం ఆ ప్రభావాన్ని కొంత వరకు తగ్గించేందుకు ఈ సడలింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ నిర్ణయం ప్రకారం.. వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు, బుల్ డోజర్లు, ఫోర్క్ లిఫ్ట్‌లు, హెచ్‌వీఏసీ పరికరాలపై ఉన్న 25శాతం టారిఫ్‌ను 15శాతంకు తగ్గించారు.

విదేశీ తయారీ సంస్థలు ఏవైనా మూలధన పరికరాలను దిగుమతి చేసుకుంటే.. వాటి బరువులో 85శాతం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న స్టీల్, అల్యూమినియం వంటివి వినియోగిస్తే 10శాతం సుంకం మాత్రమే వర్తిస్తుంది. అయితే, ట్రంప్ తాజా నిర్ణయం వల్ల భారత పరిశ్రమలకు కొంత మేరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

Paris : పారిస్ లో హింస.. ఈఫిల్ టవర్ వద్ద తగలబడుతున్న వాహనాలు..
Paris : పారిస్‌లో హింస చెలరేగింది. ఈ క్రమంలో ఈఫిల్ టవర్ సమీపంలో పదుల సంఖ్యలో వాహనాలు తగలబడుతున్నాయి. ఇందుకు కారణం.. ఫుట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్ విజయోత్సవాలు. ఈ సెలబ్రేషన్స్.. పారిస్‌లో హింసాత్మక ఘటనలకు దారితీశాయి. అసలేం జరిగిందంటే.. ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఆర్సెనల్ జట్టుపై.. పారిస్ సెయింట్-జెర్మైన్ (PSG) టీమ్ విజయం సాధించింది. దీంతో ఆ టీమ్ అభిమానులు నిర్వహించిన సంబరాలు కాస్త పారిస్ నగరంలో హింసాత్మకంగా మారాయి. విజయోత్సవాల పేరుతో కొందరు ఆకతాయిలు కార్లు, దుకాణాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫ్రెంచ్ పోలీసులు 400 మందికి పైగా అరెస్ట్ చేశారు.

హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సెనల్‌ను పెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో ఓడించిన పీఎస్‌జీ.. తన టైటిల్‌ను నిలబెట్టుకోవడంతో, ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఈ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు పారిస్ నగరంలో చాలా ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. బిగ్ స్క్రీన్ మీద మ్యాచ్‌ని వీక్షించేందుకు గాను సుమారు 40 వేల మంది పార్క్ డెస్ ప్రిన్సెస్ (Parc des Princes) స్టేడియానికి చేరుకున్నారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పీఎస్‌జీ విజయం సాధించగానే అభిమానుల ఆనందం కట్టలు తెంచుకుంది.

*విజేత‌గా నిలిచే జ‌ట్టుకే కాదు ర‌న్న‌ర‌ప్‌కు ప్రైజ్‌మ‌నీ.. ఏ జ‌ట్టుకు ఎంత అంటే?

ఈ క్రమంలో మ్యాచ్‌లో విజయం సాధించడంతో.. సంబరాలు చేసుకోవడానికి సుమారు 20 వేల మంది ప్రజలు శనివారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో షాంప్స్-ఎలిసీస్ వీధుల్లోకి వచ్చారు. గుంపులుగా చేరిన అభిమానులు పెద్ద మొత్తంలో బాణాసంచా కాల్చారు. కటౌట్లకు, తెరలకు నిప్పంటించారు. అంతటితో ఆగక అక్కడ కనిపించిన కార్లను, దుకాణాలను ధ్వంసం చేశారు. వీరిని చెదరగొట్టేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. టియర్ గ్యాస్ (బాష్పవాయువు) ప్రయోగించారు. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఒక పోలీస్ స్టేషన్‌పై కూడా దాడి జరిగింది. ఈ ఘర్షణలకు సంబంధించి మొత్తం 400 మందికి పైగా ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

*టీ20ల్లో హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ అరుదైన ఘ‌న‌త‌..

రాజధానిలో శాంతిభద్రతలను కాపాడటానికి ఫ్రాన్స్ ప్రభుత్వం 22,000 మంది పోలీసులను మోహరించింది. గత ఏడాది ఇంటర్ మిలాన్‌ను ఓడించి పీఎస్‌జీ మొదటిసారి ఛాంపియన్స్ లీగ్ గెలిచినప్పుడు జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మరణించగా, దాదాపు 200 మంది గాయపడ్డారు.

చరిత్రలో రెండుసార్లు ఛాంపియన్స్ లీగ్ గెలిచిన మొదటి ఫ్రెంచ్ క్లబ్‌గా పారిస్ సెయింట్-జెర్మైన్ రికార్డు సృష్టించింది. అలాగే ఈ ఘనతను వరుసగా (back-to-back) సాధించిన రెండవ యూరోపియన్ క్లబ్‌గా నిలిచింది. ఈ తాజా టైటిల్‌తో పీఎస్‌జీ క్లబ్ ప్రారంభమైనప్పటి నుండి గెలిచిన మొత్తం ట్రోఫీల సంఖ్య 60కి చేరింది. ఇందులో 2011లో ఖతార్ స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చిన తర్వాత సాధించినవే 42 ట్రోఫీలు ఉండటం గమనార్హం.

Michael Boulos: ట్రంప్ అల్లుడు ఇతనే.. మనోడిది కూడా పెద్ద బ్యాక్ గ్రౌండే
Michael Boulos: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్, ఆమె భర్త మైఖేల్ బౌలస్ ఈరోజు ఉదయం ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించారు. ఈ దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ జంట అక్షరధామ్ ఆలయాన్ని కూడా సందర్శించింది. అక్కడి ఫోటోలను కూడా ఆన్‌లైన్‌లో పంచుకున్నారు. 2019లో తమ సంబంధాన్ని వైట్ హౌస్‌లో అధికారికంగా ప్రకటించుకున్న ఈ జంట, గత మే నెలలో తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికింది. 2021లో ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న ట్రంప్ మార్-ఎ-లాగో రిసార్ట్‌లో వివాహం చేసుకున్నారు.

ఎవరీ మైఖేల్ బౌలస్?

మైఖేల్ బౌలస్ కుటుంబానికి మల్టీ బిలియన్ డాలర్ల వ్యాపార సంస్థ బౌలస్ ఎంటర్‌ప్రైజెస్‌ ఉంది. దానికి ఆయన వారసుడిగా, డైరెక్టర్‌గా ఉన్నారు. SCOA నైజీరియాలో ఒక రోల్ కలిగి ఉన్నారు. అంతర్జాతీయ వ్యాపార సంస్థల్లో కూడా పాలుపంచుకున్నారు. అయితే, చాలావరకు ప్రజల దృష్టికి దూరంగానే ఉన్నారు. పేజ్ సిక్స్ నివేదిక ప్రకారం, 1998లో లెబనాన్‌లో జన్మించిన బౌలస్, నైజీరియాలోని లాగోస్‌లో పెరిగారు. వలసల గురించి చర్చిస్తున్నప్పుడు 2018లో ట్రంప్ ఒకప్పుడు ఈ ప్రదేశం గురించి అనుచితంగా మాట్లాడారు. ఆ వెంటనే తన వ్యాఖ్యలు ‘బాధాకరమైనవి’ అంటూ ఖండించారు కూడా.

నికర విలువ 20 మిలియన్ డాలర్లు..

సెలబ్రిటీ నెట్ వర్త్ అంచనా ప్రకారం మైఖేల్ బౌలోస్ వ్యక్తిగత నికర విలువ సుమారు 20 మిలియన్ల డాలర్లు. బౌలోస్ పేరు SCOA నైజీరియాతో సన్నిహితంగా ముడిపడి ఉంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని ఒక ప్రధాన బహుళ వ్యాపార సంస్థ. దీనికి ఆటోమొబైల్స్, పారిశ్రామిక పరికరాలు, వినియోగ వస్తువులు, వాణిజ్యం వంటి రంగాలలో ఆసక్తులు ఉన్నాయి. మైఖేల్ స్వయంగా కుటుంబ వ్యాపారంలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వారసత్వాన్ని కొనసాగిస్తూ, బౌలోస్ కుటుంబాన్ని ఈ ప్రాంతంలోని అత్యంత ప్రముఖ వ్యాపార రాజ వంశాలలో ఒకటిగా నిలబెట్టారు.

ఆ వారసత్వానికి పునాదులు వేసింది ఆయన తండ్రి మస్సాద్ బౌలోస్. ఆయన సంవత్సరాలుగా కుటుంబ సంస్థను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రభావం వ్యాపారానికే పరిమితం కాలేదు. డిసెంబర్ 2024లో మస్సాద్ బౌలోస్ అరబ్, మధ్యప్రాచ్య వ్యవహారాలపై అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు. ఇది రాజకీయ దౌత్య వర్గాలలో ఆ కుటుంబం ప్రతిష్టను మరింత పెంచింది. యునైటెడ్ స్టేట్స్‌లో రిపబ్లికన్ సంప్రదాయవాద ఆశయాలకు దీర్ఘకాల మద్దతుదారుగా ఉన్న ఈ కుటుంబం, ప్రభావవంతమైన రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలను కొనసాగించింది. మైఖేల్ కూడా, ట్రంప్ కుటుంబంలో భాగం కావడానికి చాలా కాలం ముందు, డొనాల్డ్ ట్రంప్ మొదటి అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఆయనకు బహిరంగంగా మద్దతిచ్చారు.

వ్యాపార నేపథ్యం, రాజకీయ సంబంధాలు ఉన్నప్పటికీ 2022లో టిఫనీ ట్రంప్‌ను వివాహం చేసుకునే వరకు మైఖేల్ చాలా వరకు ప్రపంచ దృష్టికి దూరంగానే ఉన్నారు. ఆ వివాహంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. అప్పటివరకు గోప్యత పాటించే వ్యాపారవేత్త.. అందరికీ సుపరిచితమైన ప్రజా ప్రముఖుడిగా మారారు.

అప్పటి నుండి ఈ జంట అట్లాంటిక్‌కు ఇరువైపులా జరిగే ఉన్నత స్థాయి కార్యక్రమాలలో తరచుగా కనిపిస్తున్నారు. సెప్టెంబర్ 2025లో డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటన సందర్భంగా, మైఖేల్ టిఫనీ బ్రిటిష్ రాజకుటుంబ సభ్యులతో పాటు విండ్సర్ కోటలో జరిగిన ఒక అధికారిక విందులో పాల్గొన్నారు. ఇటువంటి హాజరులు వ్యాపారం, రాజకీయాలు, అంతర్జాతీయ ఉన్నత సమాజం అనే మూడు రంగాల కూడలిలో మైఖేల్ బౌలోస్ స్థానాన్ని మరింత సుస్థిరం చేశాయి.

Also Read: లాంచ్‌ ప్యాడ్‌పైనే పేలిన రాకెట్‌.. వీడియో వైరల్.. జెఫ్ బేజోస్ కంపెనీకి భారీ షాక్‌..