కరోనా వైరస్ కట్టడిలో మహిళా నేతలే ఫస్ట్!

  • Published By: madhu ,Published On : August 19, 2020 / 07:36 AM IST
కరోనా వైరస్ కట్టడిలో మహిళా నేతలే ఫస్ట్!

కరోనా వైరస్ కట్టడిలో మహిళా నేతలే ముందంజలో ఉన్నారు. వారు పాలిస్తున్న దేశాల్లో వైరస్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదు కావడం, మరణాల సంఖ్య తక్కువగా ఉండడం ఇందుకు ఉదాహరణ. వీరు అధినేతలుగా ఉన్న దేశాలు కరోనా పోరాటంలో ఎక్కువ విజయం సాధిస్తున్నాయి.



జర్మనీ, తైవాన్, న్యూజిలాండ్, ఐలాండ్ ఫిన్ లాండ్, నార్వే, డెన్మార్క్ లలో కరోనాను సమర్థవంతంగా కట్టడి చేస్తున్నారు.

న్యూజీలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ వైరస్ నివారణకు చాలా కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. వైరస్ సోకకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మార్చి 25న విధించిన లాక్ డౌన్ ని మే 11న ఎత్తివేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడమే కాదు… దానిని అంతం చేయటంలోనూ విజయం సాధించామంటూ దేశప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.



తైవాంగ్ అధ్యక్షురాలిగా ఉన్న త్సాయి ఇంగ్ వెన్ వైరస్ ను అరికట్టడానికి నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం, కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన వారితో కలిసిమెలసి ఉన్నవారిని గుర్తించడం, ఐసోలేషన్ చేయటం లాంటి చర్యలు తీసుకున్నారు. లాక్ డౌన్ విధించకుండానే కరోనాని కట్టడి చేయడం గమనార్హం.

జర్మనీ అధ్యక్షురాలు ఏంగెలా మెర్కెల్ కరోనా వైరస్ ప్రమాదకరమని ముందే గుర్తించారు. వెంటనే భారీ ఎత్తున దేశంలో పరీక్షలు నిర్వహించారు. హోం క్వారంటైన్ చేశారు. ఇక్కడ జనాభ 8 కోట్ల 3 లక్షలు ఉంటే..4 వేల 600 మంది మరణించారు.



ఫిన్లాండ్ లో కరోనా మరణాలు తక్కువగానే ఉన్నాయి. సనా మారిన్..మరో నాలుగు మహళా సారథ్యంలో ఉన్న పార్టీలతో ప్రభుత్వం నడుపుతున్నారు. ఒక శాతం కంటే తక్కువగా మరణాలు ఉన్నాయి.

స్వభావ రీత్యా మహిళలకి కొన్ని పరిస్థితులని ఎదుర్కొన్న అనుభవం ఉంటుంది. దీనివల్ల పరిస్థితి ఏదైనా ఉత్పన్నమయితే..వెంటనే నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందంటున్నారు విశ్లేషకులు.



మహిళలు నాయకత్వం వహిస్తున్న మహిళలకి స్వతహాగా కలుపుకుని పోయే స్వభావం కలిగి ఉంటారని, అదే పురుషుల్లో పోటీతత్వం ఎక్కువగా ఉంటుందంటున్నారు. మరి కొన్ని దేశాల్లో వైరస్ ని అరికట్టేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు.