సముద్ర జీవిని ఢీకొన్న బోట్ : 87మందికి గాయాలు 

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 07:42 AM IST
సముద్ర జీవిని ఢీకొన్న బోట్ : 87మందికి గాయాలు 

టోక్యో: సముద్రంలో ప్రయాణిస్తున్న ఓబోట్ ప్రమాదానికి గురైంది. సముద్ర జీవి (జలచరం)ని  హై స్పీడ్ బోట్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జపాన్ వాయవ్య తీరంలోని నైగటా..సడో దీవుల మధ్య చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 87 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 

 
ప్రమాదానికి గురైన సమయంలో బోట్ లో 121 మంది ప్రయాణిస్తున్నారనీ..వీరిలో 78 మంది గాయపడ్డారని జపాన్ కోస్ట్ గార్డ్ వర్గాలు తెలిపాయని సీఎన్ఎన్ వార్తా సంస్థ తెలిపింది. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన  ఐదుగురు ప్రయాణికులను హెలికాప్టర్ల ద్వారా ఆస్పత్రికి తరలించారనీ తెలిపింది.  పడవను సముద్ర జంతువు తాకినట్టు అనుమానిస్తున్నాం’ మని పడవలోని సిబ్బంది తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యల్లో భాగంగా కొన్ని బోట్లను..హెలికాప్టర్లను కోస్ట్ గార్డ్ అధికారులు ఘటనాస్థలికి పంపించారు. అయితే పడవను ఢీకొన్నది సముద్ర జీవజీవా..ఏమిటా అనే విషయంపై  సరైన నిర్దారణ కాలేదని..దానిపై విచారణ చేపట్టామని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.