Zelensky: యుక్రెయిన్ అధ్యక్షుడికి ఎదురుదెబ్బ.. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‍లో శాంతి సందేశం వినిపించేందుకు ‘ఫిఫా’ నో

తమ దేశంపై రష్యా దాడి నేపథ్యంలో శాంతి సందేశం ఇచ్చేందుకు అంగీకరించాలని ఫిఫాను కోరాడు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ. అయితే, ఈ ప్రతిపాదనను ఫిఫా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

Zelensky: యుక్రెయిన్ అధ్యక్షుడికి ఎదురుదెబ్బ.. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‍లో శాంతి సందేశం వినిపించేందుకు ‘ఫిఫా’ నో

Zelensky: యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం జరగనున్న ‘ఫిఫా వరల్డ్ కప్’ ఫైనల్ మ్యాచ్‌లో శాంతి సందేశం వినిపించాలనుకున్న జెలెన్‌స్కీ నిర్ణయాన్ని ఫిఫా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ‘ఫిఫా వరల్డ్ కప్-2022‘లో భాగంగా ఆదివారం ఖతార్‌లో ఫ్రాన్స్, అర్జెంటినా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే.

India vs Bangladesh: ఇండియా-బంగ్లాదేశ్ తొలి టెస్ట్.. ముగిసిన నాలుగో రోజు ఆట.. విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్

ఈ నేపథ్యంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాంతి సందేశం వినిపించే అవకాశం ఇవ్వాలని జెలెన్‌స్కీ, ఫిఫాను కోరాడు. తమ దేశంపై రష్యా చేస్తున్న దాడిని మరోసారి ప్రపంచం ముందు నిలపాలనుకున్నాడు. అయితే, ఈ ప్రతిపాదనను ఫిఫా తిరస్కరించింది. అయినప్పటికీ, యుక్రెయిన్, ఫిఫా మధ్య ఇంకా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యుక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని జెలెన్‌స్కీ అనేక అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తాడు. ప్రపంచాన్ని తమకు సాయం చేయాలని కోరాడు.

ఇజ్రాయిల్ పార్లమెంట్, గ్రామీ అవార్డ్స్, యూఎస్ లా మేకర్స్ మీటింగ్, కేన్స్ ఫిలిం ఫెస్టివల్, జీ20 సదస్సు వంటి వేదికలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యుక్రెయిన్ పరిస్థితిని జెలెన్‌స్కీ వివరించాడు. అంతర్జాతీయ జర్నలిస్టులతోనూ చర్చించాడు. ఇదే నేపథ్యంలో తాజాగా ఫిఫా వేదికపై కూడా రష్యా-యుక్రెయిన్ సంక్షోభాన్ని లేవనెత్తాలనుకున్నాడు. దీనికి ఫిఫా తిరస్కరించింది.