WHO స్పందన,కరోనా పుట్టుకపై దర్యాప్తుకు అంగీకరించిన చైనా

  • Published By: venkaiahnaidu ,Published On : May 18, 2020 / 03:37 PM IST
WHO స్పందన,కరోనా పుట్టుకపై దర్యాప్తుకు అంగీకరించిన చైనా

ఎట్టకేలకు కరోనా పుట్టుక పై మరియు మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)స్పందనపై దర్యాప్తుకు చైనా ఆమోదం తెలిపింది. ఇవాళ(మే-18,2020)వరల్డ్ హెల్త్ అసెంబ్లీ(WHA)మీటింగ్ ప్రారంభమైన విషయం విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోవిడ్-19 విషయంలో చైనా నిష్కపటంగా(openness),పార్శదర్శకంగా,భాధ్యతతో వ్యవహరించిందని వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తెలిపారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తించిన కరోనా విషయంలో WHOపై నిష్పాక్షిక దర్యాప్తు కోరుతూ WHAలో ఆస్ట్రేలియా యూరోపిన్ యూనియన్ డ్రాఫ్ట్ తీర్మాణానికి 100కి పైగా మద్దతు పలికిన విషయం తెలిసిందే. భారత్ కు ఈ తీర్మాణానికి మద్దతు పలికింది.

అయితే,ఇవాళ WHA ఓపెంగ్ కార్యక్రమం సందర్భంగా వీడియో స్పీచ్ లో జిన్ పింగ్ మాట్లాడుతూ…కోవిడ్-19కు గ్లోబల్ రెస్ఫాన్స్ పై సమగ్రమైన రివ్యూ పిలుపుకు చైనా మద్దతిస్తుంది. అయితే ప్రస్తుతం పరిస్థితులపై ప్రపంచానికి గ్రిప్ వచ్చాకే ఈ దర్యాప్తు చేపట్టాలని భావిస్తున్నానన్నారు. ప్రపంచదేశాల ప్రస్తుత ముఖ్య లక్ష్యం ప్రజలను ఈ వైరస్ నుంచి కాపాడటం అయి ఉండాలన్నారు. అయితే ఇప్పటివరకు ఆస్ట్రేలియా,అమెరికాల నుంచి వినిపించిన ఇలాంటి దర్యాప్తు పిలుపును చైనా గతంలో వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ కీలకమైన పరిస్థితిలో WHO కి సపోర్ట్ చేయడం అంటే అంతర్జాతీయ సహకారానికి మరియు అదే విధంగా ప్రాణాలు కాపాడేందుకు జరుగుతున్న ఫైటింగ్ కు సపోర్ట్ చేయడమేనని జిన్ పింగ్ అన్నారు.

జిన్ పింగ్ మాట్లాడిన కొన్ని నిమిషాల తర్వాత WHO డైర్టకర్ జనరల్ టెడ్రోస్ ఆథనామ్ మాట్లాడుతూ…తగిన తగిన సమయంలో దర్యాప్తు ప్రారంభమవుతుందన్నారు. భవిష్యత్తుల్లో సంసిద్దత కోసం రికమండేషన్లను టెడ్రోస్ ప్రకటించారు. మహమ్మారి నుంచి మనమంతా పాఠాలు నేర్చుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క దేశం,ఆర్గనైజేషన్ తమ రెస్పాన్స్ పై తప్పనిసరిగా దర్యాప్తు చేయాలని అన్నారు. డబ్యూహెచ్ వో పారదర్శకత,జవాబుదారీ తనం,నిరంతర మెరుగుదలకు కమిట్ అయి ఉందని టెడ్రోస్ తెలిపారు.

అయితే,ఇప్పుడు WHAలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వాదన.. కరోనా విషయంలో WHOపై మొదట్లో అమెరికా,ఆ తర్వాత మరికొన్ని దేశాల నుంచి తీవ్ర విమర్శల తర్వాత WHO డైర్టకర్ జనరల్ టెడ్రోస్ ఆథనామ్ సమర్పించిన వాదనకు అద్దం పట్టింది. కరోనా విషయంలో చైనాకి అనుకూలంగా టెడ్రోస్ వ్యవహరంచారని,చైనాలో జరుగుతున్న విషయాల గురించి సమాచారముండి కూడా బయటి ప్రపంచానికి కరోనా విషయంలో హెచ్చరికలు చేయడంలో చాలా ఆలస్యం చేశాడని, అంతేకాకుండా వైరస్ ను కట్టడిచేయడంలో జిన్ పింగ్ పై ప్రశంసలు కురిపించిన టెడ్రోస్ పై పలు దేశాలు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అమెరికా డబ్యూహెచ్ వోకి నిధులను కూడా ఆపేసింది.