Pm Breakfast: ప్ర‌ధాని బ్రేక్‌ఫాస్ట్ బిల్లుపై పోలీసుల విచార‌ణ

దేశ ప్రధాని బ్రేక్‌ఫాస్ట్ ఖ‌ర్చు అధికంగా చూపిస్తున్నారని ఏకంగా పోలీస్ విచారణకు ఆదేశించారు. ఫిన్‌ల్యాండ్ ప్ర‌ధాని స‌న్నా మారిన్ ప్రతి నెల తన బ్రేక్‌ఫాస్ట్ ఖ‌ర్చు నెల‌కు 365 డాల‌ర్లుగా చూపిస్తున్నారు.

Pm Breakfast: ప్ర‌ధాని బ్రేక్‌ఫాస్ట్ బిల్లుపై పోలీసుల విచార‌ణ

Pm Breakfast

Pm Breakfast: దేశ ప్రధాని బ్రేక్‌ఫాస్ట్ ఖ‌ర్చు అధికంగా చూపిస్తున్నారని ఏకంగా పోలీస్ విచారణకు ఆదేశించారు. ఫిన్‌ల్యాండ్ ప్ర‌ధాని స‌న్నా మారిన్ ప్రతి నెల తన బ్రేక్‌ఫాస్ట్ ఖ‌ర్చు నెల‌కు 365 డాల‌ర్లుగా చూపిస్తున్నారు. అంత భారీ స్థాయిలో అల్పాహార బిల్లు కావ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప్రధాని మారిన్ బ్రేక్‌ఫాస్ట్ బిల్లు అంత రావ‌డం ఏంట‌న్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ బిల్లుపై ఫిన్‌ల్యాండ్ పోలీసులు విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రధానిపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పన్ను కడుతున్న వారి సొమ్మును ప్రధాని అక్రమరీతిలో సబ్సిడీకి వాడుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాల వ్యాఖ్యలపై మారిన్ స్పందించారు.

గతంలో కూడా ఇదే విధంగా ఖర్చు చేశారని.. తానేమీ ఎక్కువ ఖర్చు చేయలేదని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం లేదని.. పాత ప్రధానులు పెట్టిన ఖర్చులను చుస్తే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. కాగా ఫిన్‌ల్యాండ్ చ‌ట్టాల ప్ర‌కారం ప‌న్నుదారుల ఆదాయాన్ని అక్ర‌మ రీతిలో వినియోగించ‌డం నేర‌మ‌ని నిపుణులు అంటున్నారు.