Ukraine Crisis: రష్యాకు షాకిచ్చేందుకు సిద్ధమైన ఫిన్లాండ్.. పుతిన్‌కు పరాభావం తప్పదా?

యుక్రెయిన్ పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. మూడు నెలలుగా విరామంలేని యుద్ధాన్ని కొనసాగిస్తోంది. యుక్రెయిన్‌కు అండగా అమెరికా, ఇతర దేశాలు ఆయుధాలను సరఫరా చేస్తూ పుతిన్ సైన్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు...

Ukraine Crisis: రష్యాకు షాకిచ్చేందుకు సిద్ధమైన ఫిన్లాండ్.. పుతిన్‌కు పరాభావం తప్పదా?

Finland

Ukraine Crisis: యుక్రెయిన్ పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. మూడు నెలలుగా విరామంలేని యుద్ధాన్ని కొనసాగిస్తోంది. యుక్రెయిన్‌కు అండగా అమెరికా, ఇతర దేశాలు ఆయుధాలను సరఫరా చేస్తూ పుతిన్ సైన్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు రష్యాతో ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాలను అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్, బ్రిటన్‌తో పాటు పలు దేశాలు నిలిపివేస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినా పుతిన్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. యుక్రెయిన్‌ను పూర్తిస్థాయిలో హస్తగతం చేసుకొనే వరకు తాను విశ్రమించబోనంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో యుక్రెయిన్‌లో రష్యా సైన్యం జరుపుతున్న మారణ హోమాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. అయినా పుతిన్ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. తాజాగా పుతిన్‌కు గట్టి షాకిచ్చేందుకు పొరుగుదేశమైన ఫిన్లాండ్ సిద్ధమైంది.

Ukraine vs russia war: నేను బతకడం దాదాపు అసాధ్యం.. ఎలాన్ మస్క్‌కు నా ట్వీట్‌ను చేరవేయండి..

నార్డిక్ దేశమైన ఫిన్లాండ్ నాటో కూటమిలో చేరేందుకు సిద్ధమవుతోంది. ఆ మేరకు వేగంగా అడుగులు వేస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు సౌలి నిన్నిస్టో, ప్రధాని సన్నామారిన్‌లు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాటోలో చేరేందుకు దరఖాస్తు చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాటో సభ్యత్వంతో ఫిన్లాండ్ భద్రత మరింత బలపడుతుందని వెల్లడించారు. ఫిన్లాండ్ చేరికతో నాటో కూటమి కూడా బలోపేతం అవుతుందని ఈ ప్రకటనలో వారు వెల్లడించారు. అయితే ఫిన్లాండ్ పార్లమెంట్, సీనియర్ రాజకీయ నేతలు పరిశీలించిన తర్వాత ఆదివారం నాటో అంశంపై ఓ ప్రకటన చేయనుంది. అదే రోజు స్వీడన్ కూడా నాటోలో చేరికపై ఓ నిర్ణయం వెలువరించనుంది. అయితే అంశం పుతిన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. నాటోలో చేరుతామంటేనే యుక్రెయిన్ పై రష్యా దండయాత్రను చేపట్టింది. ఇక మరో పొరుగు దేశం ఇదే దిశగా అడుగులు వేస్తుండటంతో పుతిన్ ఇప్పుడు ఏం చేస్తాడన్న అంశం ఆసక్తికరంగా మారింది.

Russia vs ukraine war: యుక్రెయిన్‌లో రష్యా సైన్యం దాడులు ఎందుకు.. ఎప్పటి వరకు చేస్తుందో స్పష్టం చేసిన పుతిన్

అయితే ఇప్పటికే ఫిన్లాండ్, స్వీడన్ లను రష్యా హెచ్చరించింది. ఎటువంటి సైనిక కూటముల్లో చేరకుండా తటస్థంగా ఉండటంపై కొన్ని దశాబ్దాలుగా ఉన్న పాలసీని వీడితే తీవ్ర పరిణామాలు తప్పవని రష్యా పేర్కొంది. అయితే యుక్రెయిన్ పై రష్యా దాడిచేసిన తర్వాత ఫిన్లాండ్ లో నాటోలో చేరికపై ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. ఫిన్లాండ్ 1,300 కిలో మీటర్ల సరిహద్దును రష్యాతో పంచుకుంటోంది. ఇప్పటి వరకు రష్యాతో విరోధం వద్దనుకొని నాటోలో చేరలేదు. తాజాగా ఫిన్లాండ్, స్వీడన్ లు నాటోలో చేరేందుకు సిద్ధమవుతున్న క్రమంలో పుతిన్ వారిని కట్టడి చేసేందుకు ఏ విధంగా అడుగులు వేస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.