FIR against pigeon : పాకిస్థాన్ సరిహద్దుల్లో పావురం..FIR నమోదు

FIR against pigeon : పాకిస్థాన్ సరిహద్దుల్లో పావురం..FIR నమోదు

Fir Against Pigeon Caught Near Pakistan Border

fir against pigeon caught near pakistan border : భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో పిట్ట వాలినా పెను అనుమానాలకు దారి తీస్తుంది. ఇరుదేశాల సరిహద్దుల్లో అంత భద్రత ఉంటుంది.ఈ క్రమంలో అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దులో వాలిన ఓ పావురాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానిపై కేసు న‌మోదు చేశారు. పంజాబ్‌లోని బీఓపీ రోర‌న్‌వాలా ద‌గ్గ‌ర డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ నీర‌జ్ కుమార్ కళ్లలో పడిందీపావురం. డ్యూటీలో ఉన్న నీరజ్ వేయి కళ్లతో కావలికాస్తున్న సమయంలో ఓ పావురం వ‌చ్చి అత‌నిపై వాలింది. దాని కాళ్ల‌కు ఓ పేప‌ర్ కూడా క‌ట్టి ఉండటంతో కానిస్టేబుల్ అనుమానించాడు. వెంటనే దాన్ని పట్టుకుని దానిపై కేసు నమోదు చేశారు. పాక్ స‌రిహ‌ద్దుకు 500 మీట‌ర్ల దూరంలో గత శనివారం (ఏప్రిల్ 17) ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

త‌న‌పై పావురం వాలిన వెంట‌నే ఆ కానిస్టేబుల్ దానిని ప‌ట్టుకున్నాడు. విష‌యాన్ని వెంటనే పోస్ట్ క‌మాండ‌ర్ ఓంపాల్ సింగ్‌కు తెలిపాడు. వెంట‌నే దానికి స్కానింగ్ చేశారు. దాని కాలికి క‌ట్టి ఉన్న పేప‌ర్‌పై ఓ నంబ‌ర్ రాసి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై అమృత్‌స‌ర్‌లోని క‌హాగ‌ఢ్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేశారు. గ‌తేడాది మేలో జ‌మ్ముక‌శ్మీర్‌లోని క‌థువాలో పాకిస్థాన్‌లో నిఘా కోసం శిక్ష‌ణ పొందిన‌ట్లు అనుమానిస్తున్న ఓ పావురాన్ని ఇలాగే ప‌ట్టుకున్నారు. ఈ ఘటనపై అమృత్‌సర్‌లోని కహాగఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గతేడాది మేలో జమ్ముకశ్మీర్‌లోని కథువాలో పాకిస్థాన్‌లో నిఘా కోసం శిక్షణ పొందినట్లు అనుమానిస్తున్న ఓ పావురాన్ని ఇలాగే పట్టుకున్నారు.