Fire Accindent in Dubai : దుబాయ్‌లో అగ్ని ప్రమాదం, నలుగురు భారతీయులు మృతి

దుబాయ్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు భారీయులతో సహా 16మంది ప్రాణాలు కోల్పోయారు.

Fire Accindent in Dubai : దుబాయ్‌లో అగ్ని ప్రమాదం, నలుగురు భారతీయులు మృతి

fire Accindent in Dubai

fire Accindent in Dubai : దుబాయ్‌లోని ఓ అపార్ట్ మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులతో సహా మొత్తం 16మంది మంటల్లో సజీవంగా దహనమైపోయారు. కేరళకు చెందిన రిజేష్ అనే 38 ఏళ్ల వ్యక్తితో పాటు అతని భార్య 32 ఏళ్ల జిషి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అలాగే తమిళనాడుకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఈ ప్రమాదంలో చనిపోయారు. వీరితో పాటు ముగ్గురు పాకిస్థానీయులు, నైజీరియాకు చెందిన ఓ మహిళతో సహా మరో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

దుబాయ్‌లోని అల్ రస్‌ ప్రాంతంలో శనివారం (ఏప్రిల్16,2023) మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. అపార్ట్ మెంట్ లోని నాలుగో అంతస్తులో సంభవించిన మంటలు క్రమంగా మిగతా అంతస్తులకు పాకాయి.ఈ ప్రమాదపై సమాచారం అందుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని నివాసితులను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో మరణించిన నలుగురు భారతీయుల్లో కేరళకు చెందిన దంపతులు, తమిళనాడుకు చెందిన ఇద్దరు ఉన్నారని అధికారులు వెల్లడించారు.

కేరళలోని మలప్పురానికి చెందిన రిజేష్ ఓ ట్రావెల్ కంపెనీలో ఉద్యోగి కాగా అతని భార్య జిషి క్రెసెంట్ హైస్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారని దుబాయ్ లోనే నివసిస్తున్న కేరళకు చెందిన సామాజిక కార్యకర్త నసీర్ వాటనపల్లి గుర్తించారు. వారితో పాటు మృతి చెందినవారిలో తమిళనాడుకు చెందిన ఇద్దరు పురుషులు మరో ముగ్గురు పాకిస్థానీలు, ఓ నైజీరియా మహిళ ఉన్నారని దుబాయ్ సివిల్ డిఫెన్స్ ప్రతినిధి తెలిపారు. ఈ ప్రమాదంలో 16మంది చనిపోగా మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు.

భవన నిర్మాణ సంస్థ సరైన రక్షణ చర్యలు పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్న అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.