నడి సముద్రంలో తగులబడ్డ ఓడలు : భారతీయులు మృతి 

  • Published By: veegamteam ,Published On : January 22, 2019 / 07:13 AM IST
నడి సముద్రంలో తగులబడ్డ ఓడలు : భారతీయులు మృతి 

రష్యా  : నడి సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడల్లో అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11మంది మృతి చెందారు. వీరిలో పలువురు భారతీయులు కూడా వున్నారు. చైనా, రష్యా దేశాల సముద్ర జలాలను విడదీసే క్రెచ్ స్ట్రెయిట్ జలసంధిలో రెండు ఓడలు తగులబడిపోయిన ఘటనలో భారతీయులతో సహా 11 మంది మరణించిన ఈ ఘటన రష్యా దేశానికి చెందిన సముద్ర జలాల్లో చోటుచేసుకుంది.
 

ప్రమాదానికి గురైన ఈ షిప్స్ లో పలువురు భారతీయులతో పాటు టర్కి, లిబియా పౌరులుకూడా వున్నారు. ఈ రెండు ఓడలపైనా టాంజానియా జెండాలు ఉన్నాయని..వీటిల్లో ఒకటి లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ ను తరలిస్తుండగా, మరొకటి ట్యాంకర్ అని..రెండు నౌకల మధ్యా ఫ్యూల్ సప్లై (ఇందన సరఫరా)జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘దీ క్యాండీ’ అనే పేరున్న గ్యాస్ తరలించే షిప్ లో 8 మంది భారతీయులు..టర్కీ కి చెందిన 9 మంది సిబ్బందిగా వర్క్ లో వున్నారు. ఇక ‘ది మ్యాస్ట్రో’ అనే పేరున్న రెండో షిప్ లో  ఏడుగురు టర్కీవారు..ఏడుగురు భారతీయులతో పాటు ఒక లిబియా కు చెందిన వ్యక్తి వున్నారని రష్యా న్యూస్ ఏజన్సీ ఒకటి తెలిపింది. 
మొదట ఓ షిప్ లో మంటలు చెలరేగగా..అవి రెండో షిప్ కు వ్యాపించాయని ఈ ప్రమాదం నుండి బైటపడిన వారు తెలిపారు. రెండు షిప్స్ లోను మంటలు ఎక్కువవటంతో వేరే దారి లేక కొంతమంది సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారనీ..ప్రమాదం సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని 12 మందిని రక్షించామని తెలిపింది. ఈ విషయాన్ని రష్యన్ టెలివిజన్ నెట్ వర్క్ ఆర్టీ న్యూస్ వెల్లడించింది.