11 అడుగులు.. 77 పౌండ్లు.. భారీ కొండచిలువ.. టెర్రస్ పైకి పాకుతుండగా..!

11 అడుగులు పొడవు.. 77 పౌండ్ల బరువు.. అతిపెద్ద భారీ కొండచిలువ.. చెట్టుపైకి ఎప్పుడు ఎక్కింది తెలియదు కానీ.. ఓ ఇంటి టెర్రస్ పైకి మెల్లగా పాకుతూ వెళ్తోంది.

11 అడుగులు.. 77 పౌండ్లు.. భారీ కొండచిలువ.. టెర్రస్ పైకి పాకుతుండగా..!

Firefighters Catch 11 Foot Python In Bangkok Park

Firefighters catch 11 foot python : 11 అడుగులు పొడవు.. 77 పౌండ్ల బరువు.. అతిపెద్ద భారీ కొండచిలువ.. చెట్టుపైకి ఎప్పుడు ఎక్కింది తెలియదు కానీ.. ఓ ఇంటి టెర్రస్ పైకి మెల్లగా పాకుతూ వెళ్తోంది. ఇంతలో అక్కడి పార్కులో ఆడుకునే పిల్లలు చూసి పెద్దగా కేకలు వేయడంతో పార్క్ అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది టెర్రస్ పైఎక్కి పాకుతున్న కొండచిలువను ఎట్టకేలకు పట్టేసుకున్నారు.

ఈ ఘటన బ్యాంకాక్ పార్కులో జరిగింది. ఇటీవలే బెంజాసిరి పార్క్ టవరింగ్ హోటల్స్, అపార్టమెంట్ బుల్డింగ్స్, హైఎండ్ షాపింగ్ మాల్స్‌లో కూడా ఇలాంటి ఎన్నో కొండచిలువలు కనిపించడం కామన్ అయిపోయింది. చెట్టు పైకొమ్మ నుంచి నెమ్మదిగా పాకుతూ పక్కనే ఉన్న భవనం టెర్రస్ పైకి వెళ్తోంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెళ్లి ఆ కొండచిలువను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ కొండచిలువను రక్షించిన అనంతరం దాని పొడవు 11 అడుగులు ఉందని, బరువు 77 పౌండ్ల బరువు ఉందని అంటున్నారు. ఇదే ప్రాంతంలో పలు భవనాలపై రోజుకు ఇలాంటి కొండచిలువులు రెండు వరకు రక్షిస్తుంటామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో జంతువులకు అవసరమైన ఆహారం లేకపోవడంతో ఆహారం కోసం ఇలా జంతువులు, పాములు జనసంచారంలోకి వస్తున్నాయని అంటున్నారు.