2025 నాటికి పెట్రోల్, డీజిల్ కార్లు సేల్స్ బంద్

2025 నాటికి పెట్రోల్, డీజిల్ కార్లు సేల్స్ బంద్

petrol vehicles

electric cars than petrol vehicles : 2025 నాటికి పూర్తిగా పెట్రోల్‌, డీజిల్‌ కార్ల విక్రయాలను నిలిపివేసిన దేశంగా నిలువాలని నార్వే నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు నార్వేనియన్లు. నార్వేలో ఎలక్ట్రిక్‌ కార్ల సేల్స్‌ విపరీతంగా పెరుగుతున్నాయి.. 2019తో పోలిస్తే 2020లో పెట్రోల్‌, డీజిల్‌ కార్ల కొనుగోళ్లు భారీగా తగ్గాయి. ప్రపంచంలోకెల్లా టాప్‌ బ్యాటరీ వెహికల్‌ ప్రొడ్యూసర్‌గా నిలిచిన టెస్లాను సైతం జర్మనీ ఆటో మేకర్‌ వోక్స్‌ వ్యాగన్‌ అధిగమించి నార్వేలో విద్యుత్‌ వాహనాల విక్రయాల్లో రికార్డు నెలకొల్పింది.

ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలను పెంచడానికి పూర్తిగా పన్ను రాయితీలిస్తూ.. పెట్రోల్‌ లేదా డీజిల్‌ ఆధారిత కార్ల కొనుగోళ్లపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు విధిస్తుంది నార్వే. అక్కడి ఆటోమొబైల్‌ ల్యాబ్‌లు భవిష్యత్‌లో ఇంటర్నల్‌ కంబూష్టన్‌ ఇంజిన్‌ లేకుండా కార్ల తయారీపై దృష్టిని కేంద్రీకరించాయి. 2020లో నెలల వారీగా 50 శాతం విద్యుత్‌ కార్ల విక్రయాలు నమోదయ్యాయి. గత డిసెంబర్‌ నెలలో కార్ల మార్కెట్‌లో విద్యుత్‌ కార్లది 66.7 శాతం అని నార్వే ప్రకటించింది..

నార్వేలో వోక్స్‌ వ్యాగన్‌కు చెందిన ఆడికి చెందిన ఈ-ట్రోన్‌ కారు 2020లో అత్యధికంగా అమ్ముడయ్యాయి. టెస్లా మిడ్‌ సైజ్డ్‌ మోడల్‌-3 కారు రెండో స్థానానికి పరిమితమైంది.. ఇదే స్థాయిలో విద్యుత్‌ కార్లను విక్రయించగలిగితే 2025 నాటికి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోగలమని నార్వే అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.