Flurona Case : ఇజ్రాయెల్‌ను కలవరపెడుతున్నకొత్త వైరస్ ఫ్లోరోనా

కరోనా కొత్త వేరియంట్ ఫ్లోరోనా ఇప్పుడు ఇజ్రాయెల్ ను కలవర పెడుతోంది. డెల్టా, ఒమిక్రాన్ ల కలయికతో ఫ్లోరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

Flurona Case : ఇజ్రాయెల్‌ను కలవరపెడుతున్నకొత్త వైరస్ ఫ్లోరోనా

Flurona

Flurona Case :  కరోనా కొత్త వేరియంట్ ఫ్లోరోనా(ఫ్లూరోనా) ఇప్పుడు ఇజ్రాయెల్ ను కలవర పెడుతోంది. డెల్టా, ఒమిక్రాన్ ల కలయికతో ఫ్లోరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. సెంట్రల్ ఇజ్రాయెల్ లోని   పెటా టిక్వా నగరంలోని బీలిన్సన్ ఆస్పత్రిలో ఇటీవలే ప్రసవించిన మహిళలో మొదటి ఫ్లూరోనా వైరస్ కనుగొనబడిందని అరబ్ న్యూస్ వార్తా సంస్ధ తన ట్విట్టర్ లో వెల్లడించింది.

ఆ మహిళ వ్యాక్సిన్ తీసుకోలేదని తెలిసింది. ఫ్లోరోనా అంటే కోవిడ్-19,ఇన్ ఫ్లూయెంజా డబుల్ ఇన్ ఫెక్షన్ అని వైద్యులు తెలిపారు. మరోవైపు భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో దేశంలోవ్యాక్సినేషన్ ముమ్మరం చేశామని ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ నచ్‌మన యాష్ తెలిపారు. తక్కువ ఇమ్యునిటీ ఉన్నవాళ్లకు నాలుగో డోసు వ్యాక్సిన్ కూడా ఇస్తున్నట్టు తెలిపారు.

డబుల్ ఇన్ ఫెక్షన్ యొక్క మొదటి కేసు కనుగొన్నప్పటికీ వ్యాధిని నిర్ధారణ చేయటానికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖమంత్రి తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు పడతారని వైద్యులు తెలిపారు.  ఇక గురువారం ఒక్కరోజే 5 వేల కోవిడ్‌ కేసులు బయట పడటంతో దేశ ఆరోగ్య శాఖ మంత్రి నిట్జన్‌ హొరొవిట్జ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. చాలా కేసులు ఒమిక్రాన్‌ వేరియంట్‌వేనని అన్నారు.

Also Read : Corona Instructions : WHO హెచ్చరికల నేపథ్యంలో.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

ఇజ్రాయెల్ లో కోవిడ్ ఫిఫ్త్‌  వేవ్‌ నడుస్తోందని రోగ్య శాఖ మంత్రి చెప్పారు. ఒమిక్రాన్‌ నుంచి రక్షణ పొందేందుకు నాలుగో డోసు వ్యాక్సిన్‌ తప్పనిసరైందని అన్నారు.  వైరస్ బయటపడినప్పటి నుంచి దేశంలో కోవిడ్ వల్ల 8,000 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం దేశంలో 20,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 94 మంది పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.