పాకిస్తాన్ లో పోలీస్ ఆఫీసర్ గా హిందూ యువతి

  • Published By: vamsi ,Published On : September 4, 2019 / 01:46 PM IST
పాకిస్తాన్ లో పోలీస్ ఆఫీసర్ గా హిందూ యువతి

పాకిస్తాన్ దేశంలో తొలిసారి ఓ హిందూ యువతి పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం దక్కించుకుంది. సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో పాస్ అయిన పుష్ప కొల్హిని సింధ్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎఎస్‌ఐ) గా నియమించబడింది. దీంతో పాకిస్తాన్ దేశంలో ఏఎస్సైగా నియమితులైన తొలి హిందూ యువతిగా ఆమె పేరు రికార్డులకు ఎక్కింది. సింధూ ప్రావిన్స్ లో పుష్ఫా కొల్హికి పోస్టింగ్ ఇచ్చినట్టు అక్కడి మీడియా చానెళ్లు వెల్లడించాయి.

ఈ విషయాన్ని మానవహక్కుల కార్యకర్త కపిల్ దేవ్ ట్విటర్ ద్వారా కూడా తెలిపారు. జనవరిలో హిందూ సామాజికవర్గానికి చెందిన సుమన్ పవన్ బోదాని సివిల్ మెజిస్ట్రేట్ గా నియమితులయ్యారు. ఇప్పుడు మైనారిటీలుగా ఉన్న హిందువులు నుంచి ఒకరు పోలీసు కావడం విశేషం. పాకిస్తాన్ లో అతిపెద్ద మైనార్టీ కమ్యూనిటీగా హిందువులు ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం పాకిస్తాన్ లో మొత్తం 75లక్షల మంది హిందువులు ఉండగా.. అనధికారికంగా ఈ సంఖ్య 90లక్షల వరకు ఉండవచ్చని అంటున్నారు.