అంటార్కిటిక్ మంచులో ఈదిన తొలి వ్యక్తి ఇతడే!

  • Published By: sreehari ,Published On : January 27, 2020 / 06:46 AM IST
అంటార్కిటిక్ మంచులో ఈదిన తొలి వ్యక్తి ఇతడే!

బ్రిటన్‌కు చెందిన ఓ అథ్లెట్ అంటార్కిటిక్ సముద్రంలోని మంచు పలక కింద నుంచి ఈదిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. గడ్డు కట్టుకపోయే మంచు నీటిలో ఈదుతూ ఈ ఫిట్ సాధించాడు. కేవలం స్విమ్మింగ్ సంబంధిత దుస్తులు, టోపీ, కళ్లజోడుతో మాత్రమే అంటార్టికాలో సముద్రంలో ఈదాడు.

అతడే లెవిస్ పుగ్ (50) ఈతగాడు. గడ్డు కట్టుకపోయిన సూప్రా గ్లాసియల్ లేక్ సమద్రజలాల్లో 10 నిమిషాలు ఉండి రికార్డు నెలకొల్పాడు. అయితే, మంచు నీటిలో ఈది రికార్డు సృష్టించాలనేది అతడి ధ్యేయం కాదు. అతడి చేసిన ఫిట్ వెనక అసలు కారణం మరొకటి ఉంది. వాతావరణంలో వస్తున్న పెనుమార్పులపై అవగాహన కల్పించేందుకు బ్రిటన్ స్విమ్మర్ పుగ్ ఈ ఫీట్ ద్వారా తెలియజేశాడు.

రోజురోజుకీ వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. మంచుతో నిండిన అంటార్టికా సముద్రం కరిగిపోతోంది. అక్కడి జంతువులకు కూడా ఆహార కొరత ఏర్పడింది. వాతావరణ అత్యవసర పరిస్థితి నెలకొంది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన పుగ్.. ‘తూర్పు అంటార్టికాలోని వాతావరణ పరిస్థితిని ఈ మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నాను.

ఈ ప్రాంతంలో నెమ్మదిగా మంచు కరిగిపోతోంది. వాతావరణ ఎమర్జెన్సీని అతి త్వరలో ఎదుర్కోబోతున్నామనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రపంచ నేతలంతా కలిసి దీనిపై ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజులు గడిచిపోతున్నాయి. పరిస్థితి తీవ్రంగా మారుతోంది. దీన్ని ప్రతిఒక్కరికి షేర్ చేయండి’ అంటూ #COP26 హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశాడు.

ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ పోస్టులో.. అంటార్టికాలో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ‘ఎంతో అందంగా ఉంది.. ఈదడం భయంగానూ అనిపించింది. ఈదే సమయంలో మంచు పలక అడుగుభాగంలో ఇబ్బందకర పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాను. ఆకస్మాత్తుగా మంచు గడ్డ అడ్డు వచ్చింది. వెంటనే పక్కకు జరగడంతో లక్కీగా ఈతను పూర్తి చేసి సురక్షితంగా బయటపడ్డాను’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.