North Korea: ఉత్తర కొరియా-దక్షిణ కొరియా క్షిపణి ప్రయోగాలు.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

దక్షిణ కొరియా జలాలకు సమీపంలో తొలిసారిగా ఉత్తర కొరియా క్షిపణులు వచ్చిపడ్డాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియా ఇవాళ ఉదయం అధికారికంగా ప్రకటించింది. ఏడు దశాబ్దాల తర్వాత మళ్ళీ తొలిసారి ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా చర్య ఉపేక్షించరానిదని దక్షిణ కొరియా మిలటరీ అధికారులు చెప్పారు. ఉత్తర కొరియా చర్యలకు ప్రతిగా దక్షిణ కొరియా గగనతలం నుంచి భూతలం మీదకు క్షిపణి పరీక్షలు చేసింది.

North Korea: ఉత్తర కొరియా-దక్షిణ కొరియా క్షిపణి ప్రయోగాలు.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

South Korea

North Korea: కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతున్నాయి. దక్షిణ కొరియా జలాలకు సమీపంలో తొలిసారిగా ఉత్తర కొరియా క్షిణణులు వచ్చిపడ్డాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియా ఇవాళ ఉదయం అధికారికంగా ప్రకటించింది. ఏడు దశాబ్దాల తర్వాత మళ్ళీ తొలిసారి ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా చర్య ఉపేక్షించరానిదని దక్షిణ కొరియా మిలటరీ అధికారులు చెప్పారు. ఉత్తర కొరియా చర్యలకు ప్రతిగా దక్షిణ కొరియా గగనతలం నుంచి భూతలం మీదకు క్షిపణి పరీక్షలు చేసింది.

ఇరు దేశాలు క్షిపణులతో బెదిరింపులకు పాల్పడడంతో కలకలం చెలరేగుతోంది. ఉత్తర కొరియా తూర్పు సరిహద్దుకు సమీపంలో తమ యుద్ధ విమానాలు విజయవంతంగా క్షిపణులతో వదిలాయని దక్షిణ కొరియా తెలిపింది. ఉత్తర కొరియా ఇటీవల వరుసగా క్షిపణి ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే.

దీంతో దక్షిణ కొరియా-అమెరికా పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపడుతున్నాయి. శుక్రవారం వరకు ఈ సంయుక్త విన్యాసాలను కొనసాగించనున్నట్లు తెలిపాయి. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు చేపట్టనుందని నిఘా వర్గాలు తమ నివేదికల్లో తెలిపడంతో అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాలు చేపడుతున్నాయి. దీంతో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంటూ నిన్న ఉత్తర కొరియా హెచ్చరించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..