Baby Chimpanzees Kidnapped : ప్రపంచంలో మొదటిసారి చింపాంజీ పిల్లలు కిడ్నాప్ .. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులు

డబ్బుల కోసమో లేదా పాత కక్షలతోనే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తారని విన్నాం. వార్తల్లో చూశాం. డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వకపోతే పిల్లల్ని చంపేస్తామనే బెదిరింపుల గురించి కూడా తెలుసు. కానీ డబ్బుల కోసం చింపాంజీ పిల్లల్ని కిడ్నాప్ చేశారు కొంతమంది దుండగులు.

Baby Chimpanzees Kidnapped : ప్రపంచంలో మొదటిసారి చింపాంజీ పిల్లలు కిడ్నాప్ .. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులు

3 baby chimps were kidnapped

Baby Chimpanzees Kidnapped : డబ్బుల కోసమో లేదా పాత కక్షలతోనే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తారని విన్నాం. వార్తల్లో చూశాం. డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వకపోతే పిల్లల్ని చంపేస్తామనే బెదిరింపుల గురించి కూడా తెలుసు. కానీ డబ్బుల కోసం చింపాంజీ పిల్లల్ని కిడ్నాప్ చేశారు కొంతమంది దుండగులు. చింపాంజీ పిల్లల్ని కిడ్నాప్ చేయటం ప్రపంచంలోనే ఇదే మొదటిసారిగా జరగటం గమనించాల్సిన విషయం.

ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(DRC)లో మూడు చింపాంజీ పిల్లలను అపహరించారు కొంతమంది దుండగులు. ప్రపంచంలో ఇదే మొదటిసారని కేంద్రం నిర్వాహకులు చెప్పినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. ఇటీవల ఇక్కడి లబుంబాషిలోని ఓ జంతు సంరక్షణ కేంద్రంలోకి చొరబడిన కొంతమంది దుండగులు.. అక్కడ సంరక్షణలో ఉన్న 5 పిల్ల చింపాంజీల్లో మూడింటిని ఎత్తుకెళ్లారు. డబ్బుల కోసం చింపాంజీ పిల్లలను కిడ్నాప్ చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారని కేంద్రం వ్యవస్థాపకుడు ఫ్రాంక్ చాంటెరో తెలిపారు. ఐదు పిల్లల్లో మూడింటిని ఎత్తుకెళ్లగా మిగిన రెండు చింపాంజీ పిల్లలను కిచెన్ లో వదిలేశారని వెల్లడించారు ఫ్రాంక్.

ఈ కిడ్నాప్ గురించి ఫ్రాంక్ చాంటెరో మాట్లాడుతూ..నిజానికి దుండగులు చింపాంజీ పిల్లల్ని కిడ్నాప్ చేయటానికి రాలేదు. సెలవుల్లో ఈ జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించటానికి వచ్చే పిల్లలను కిడ్నాప్ చేయటానికి వచ్చారు. కానీ పిల్లలు రాకపోవడంతో చింపాంజీ పిల్లల్ని ఎత్తుకెళ్లారు. డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వకపోతే వాటిని చంపేస్తామని బెదిరిస్తున్నారు’ అని తెలిపారు.

కానీ డబ్బులు ఇవ్వటం కుదరని తేల్చి చెప్పామని ఒకవేళ కిడ్నాపర్లకు లొంగిపోతే.. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగే అవకాశముందని అందుకే డబ్బులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పామని తెలిపారు. వారు డిమాండ్ చేసినంత డబ్బులు ఇచ్చినా..ఆ జంతువులను తిరిగి ఇస్తారనే గ్యారంటీ కూడా లేదన్నారు. దేశ పర్యావరణశాఖ మంత్రికి మీడియా సలహాదారు మిచెల్ కోయక్పా ఈ ఘటనపై స్పందిస్తూ..మూగ జీవాలను కూడా ఇలా డబ్బుల కోసం కిడ్నాప్ చేయటం అమానవీయమైనదని..వెంటనే ఆ చింపాంజీ పిల్లలను వదలిపెట్టాలని కోరారు. కాగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.