Covid-19 tests: మనుషులకే కాదు.. చేపలకు, పీతలకు కూడా కొవిడ్ టెస్ట్

ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఉధృతంగా జరిగింది. అయితే కొవిడ్ మొదటగా వెలుగు చూసిన చైనాలో మనుషులతో పాటు చేపలు, పీతలకు కూడా కొవిడ్ టెస్టులు చేస్తున్నారు. పీపీఈ కిట్లు వేసుకుని కొంత మంది చేపల నోట్లతో పీతల పెంకుల్లో నుంచి లాలాజలం తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‭చల్ చేస్తోంది. ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజెన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

Covid-19 tests: మనుషులకే కాదు.. చేపలకు, పీతలకు కూడా కొవిడ్ టెస్ట్

Fish and crabs undergo Covid 19 tests in china

Covid-19 tests: కొవిడ్-19.. ప్రపంచాన్ని వణించిన మహమ్మారి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొవిడ్ తీవ్రతను ఎదుర్కోని వ్యక్తి ప్రపంచంలో లేడంటే అతిశయోక్తి కాదు. స్వేచ్ఛగా సంచరించే జనజీవనం ఒక్క సారిగా నాలుగు గోడల మధ్య బంధీ అయిపోయింది. కాలు బయట పెడితే నోటికి మాస్కు వచ్చి చేరింది. తోటి జనాలను కూడా తాకలేని విపత్కర పరిస్థితులు. ఇవే కాకుండా, ఆర్థిక సంక్షోభం, ఆకలి బాధలు.. ఇలా ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు కొవిడ్ వల్ల అనుభవించాల్సి వచ్చింది.

మానవ జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన ఈ కొవిడ్‭కు భయపడని వారు లేరు. అందుకే ప్రభుత్వాలు ముందుకు కదిలి ప్రజలకు కొవిడ్ టెస్టులు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఉధృతంగా జరిగింది. అయితే కొవిడ్ మొదటగా వెలుగు చూసిన చైనాలో మనుషులతో పాటు చేపలు, పీతలకు కూడా కొవిడ్ టెస్టులు చేస్తున్నారు. పీపీఈ కిట్లు వేసుకుని కొంత మంది చేపల నోట్లతో పీతల పెంకుల్లో నుంచి లాలాజలం తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‭చల్ చేస్తోంది. ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజెన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

కొంత మంది దీనిని వ్యతిరేకిస్తుండగా.. మరి కొందరు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయమై ఒక నెటిజెన్ స్పందిస్తూ ‘‘మొదట చూడగానే ఆశ్చర్యం వేసింది. కానీ, మనుషులైనా జంతువులైనా, సముద్ర జీవులైనా ఆరోగ్యం విషయంలో అన్ని ప్రాణులు ఒకటే. అందరికీ అటుఇటుగా ఒకే రకంగా వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మూగ జీవాలకు కూడా కొవిడ్ టెస్టులు చేయడం శుభపరిణామం’’ అని రాసుకురాగా.. మరొక వ్యక్తి ‘‘చూడగానే ఇదేదో జోక్ అనుకున్నాను. కానీ మనుషులు ఇంత దారుణంగా తయారయ్యారేంటి? వూహాన్ మార్కెట్‭లో ఉన్న జంతువులన్నింటినీ తీసుకొచ్చి టెస్టులు చేయాలేమో. ఎందుకంటే కొవిడ్ అక్కడే పుట్టింది కదా?’’ అని స్పందించాడు.

Mumbai: 11 ఏళ్ల స్నేహితురాలిపై ముగ్గురితో అత్యాచారం చేయించడమే కాకుండా, అక్కడే ఉండి చూస్తూ పైశాచిక ఆనందం