Bloue Labster : జాలరికి చిక్కిన అరుదైన నీలిరంగు లాబ్ స్టర్..

ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్ ప్రాంతంలో చేపలు పడుతున్న ఓ జాలరికి అరుదైన నీలి రంగు ఎండ్రకాయ (Labster) దొరికింది. పడవలో చేపలు పడుతుండగా ఇది అతని వలలో పడింది. వలలో నీలి రంగులో మెరిసిపోతున్న దాన్ని చూసి అదేమిటాని అనుకున్న జాలరి దాన్ని బోటులోకి తీశాక..వావ్ అని ఆశ్చర్యపోయాడు.

Bloue Labster : జాలరికి చిక్కిన అరుదైన నీలిరంగు లాబ్ స్టర్..

Bloue Labster

Rare Bloue Labster : Labster.. సముద్రాల్లో ఉండే రొయ్యలా ఉంటాయి. చాలా రంగుల్లో ఉండే ఈ లాబ్ స్టర్స్ కు మంచి డిమాండ్ ఉంది. లాబ్ స్టర్స్ అంటే పెద్ద సైజు రొయ్యల్లా ఉంటాయి. వీటిని ఎండ్రకాయలు అంటే పీతలు అని కూడా అంటారు. ఇవి చాలా రంగుల్లో ఉంటాయి.ఎరుపు, నలుపు, పసుపురంగు,కొన్ని లాబ్ స్టర్స్ అయితే రంగురంగుల్లో ఉంటాయి.

11

రొయ్యల్లా కనిపించే ఇవి చాలా పెద్ద సైజులో ఉంటాయి.ఒక్కొక్కటీ అరకిలో..కొన్నైతే కిలో బరువు కూడా ఉంటాయి. కానీ ఓ జాలరికి అరుదైన నీలి రంగులో ఉండే లాబ్ స్టర్ లభించింది. జాలరులకు రోజుకు ఒకటి రెండు లాబ్ స్టర్లు దొరికితే వాళ్ల పంట పండినట్లే. అంత ధర పలుకుతాయి ఇవి. దీంతో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది.

3

ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్ ప్రాంతంలో చేపలు పడుతున్న ఓ జాలరికి అరుదైన నీలి రంగు ఎండ్రకాయ (Labster) దొరికింది. పడవలో చేపలు పడుతుండగా ఇది అతని వలలో పడింది. వలలో నీలి రంగులో మెరిసిపోతున్న దాన్ని చూసి అదేమిటాని అనుకున్న జాలరి దాన్ని బోటులోకి తీశాక..వావ్ అని ఆశ్చర్యపోయాడు.

10

ఎందుకంటే అన్నేళ్లనుంచి సముద్రంలో చేపలు పడుతున్న అతనికి ఎన్నో లాబ్ స్టర్స్ దొరికాయి గానీ ఇటువంటి నీలి రంగు లాబ్ స్టర్ మాత్రం ఎప్పుడూ దొరకలేదు. దీంతో దాన్ని పట్టుకున్న అతడు దీని ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ లాబ్ స్టర్ అరుదైనదీ..పైగా అది చిన్నసైజులో ఉండటంతో దాన్ని పట్టుకుని అమ్ముకోవటానికి అతనికి మనస్సు ఒప్పలేదు. దీంతో దాన్ని తిరిగి సముద్రంలోనే వదిలేశాడు.

Bloue

ఈ నీలిరంగు లాబ్ స్టర్ గురించి నేషనల్ లాబ్‌స్టర్ హ్యాట్చరీ ప్రతినిధి మాట్లాడుతూ..ఇటువంటి ఎండ్రకాయలు (Labster)లక్షలో ఒకటి ఉంటాయని..ఇవి నీలం రంగులో ఉండడం వల్ల వీటిని వేటాడే జంతువులకు సులభంగా దొరికిపోతాయని చెప్పారు. వీటి శరీరపు రంగును ఉత్పత్తి చేసే కణాల్లో ఉండే మార్పుల వల్లే ఇవి ఇలా నీలం రంగులో మారతాయని తెలిపారు.