Whiskey From Fish Belly : చేప కడుపులో విస్కీ బాటిల్, ఎలా వచ్చిందబ్బా

సముద్రంలో పట్టుకున్న చేప కడుపులో నుంచి విస్కీ బాటిల్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఓ చేపను మత్స్యకారుడు కట్ చేస్తున్నాడు. కడుపు భాగం కట్ చేసిన అనంతరం అందులో నుంచి విస్కీ బాటిల్ బయటకు వచ్చింది.

Whiskey From Fish Belly : చేప కడుపులో విస్కీ బాటిల్, ఎలా వచ్చిందబ్బా

Fisherman Finds An Unopened Bottle Of Whisky Inside A Fish

Whiskey From Fish Belly : సముద్రంలో పట్టుకున్న చేప కడుపులో నుంచి విస్కీ బాటిల్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఓ చేపను మత్స్యకారుడు కట్ చేస్తున్నాడు. కడుపు భాగం కట్ చేసిన అనంతరం అందులో నుంచి విస్కీ బాటిల్ బయటకు వచ్చింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియదు. ఇధ్దరు మత్స్యకారులు అందులో ఉండడం కనిపించింది.
సముద్రంలో బోటుపై ఇద్దరు మత్స్యకారులు ఉన్నారు.

ఓ టేబుల్ పై రెండు పెద్ద చేపలున్నాయి. ఓ మత్స్యకారుడు కత్తి తీసుకుని ఓ చేప శరీరాన్ని కట్ చేశాడు. ముందుగా తల నుంచి చివరి భాగం వరకు కట్ చేశాడు. ఆ భాగాన్ని ఓ పక్కకు ఉంచి..కడుపులో ఏదో ఉందని గమనించాడు. అనంతరం ఆ భాగాన్ని కట్ చేయగా..అమాతం..విస్కీ బాటిల్ బయటకు వచ్చింది. దీనిని చూసి ఆశ్చర్యపోయాడు ఆ మత్స్యకారుడు. బాటిల్ ను పైకి చూపిస్తూ..నవ్వాడు. దీనికి సంబంధించిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా..తెగ వైరల్ గా మారింది. చేపల కడుపులో బతికి ఉన్న ఓ చిన్న తాబేలును జీవ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.