E-Waste: ఒక్క ఏడాదిలోనే చెత్తకుప్పలో పడ్డ 530 కోట్ల మొబైల్ ఫోన్స్..!

వీటిలో ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల, టోస్టర్లు వంటివి ఉన్నాయి. వీటిలో 13 వస్తువుల వరకు పనిచేయకపోయినా ఇంటిలోనే పెట్టుకుంటున్నారు. దీనికి సెంటిమెంట్, మరమ్మతు ఖర్చు లాంటివి కారణం. వీటిలో ఎక్కువగా పాత హెడ్‌ఫోన్లు, రిమోట్‌లు, గడియారాలు, ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్‌లు, రౌటర్లు, కీబోర్డులు, మౌస్‌లు, పాత ఫోన్లు వంటివి ఉన్నాయి. డాక్టర్ కీస్ బాల్డే దీనిపై మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా నేడు ఈ-వ్యర్థాలు 5.4 టన్నులకు చేరుకున్నట్టు పేర్కొన్నారు.

E-Waste: ఒక్క ఏడాదిలోనే చెత్తకుప్పలో పడ్డ 530 కోట్ల మొబైల్ ఫోన్స్..!

Five billion phones to be thrown away in 2022

E-Waste: రోజు రోజుకు ఈ-వేస్ట్ బాగా పెరిగిపోతోంది. ఇందులో ఎక్కువగా మొబైలో ఫోన్లే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది కోట్లాది ఫోన్లు ఈ-వేస్ట్‭గా మారిపోతున్నాయి. ఈ ఏడాది ఇలా మారే వాటి సంఖ్య ఏకంగా 530 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ-వేస్ట్‌‭ను ఇది పర్యవేక్షిస్తోంది. ఇలా ఈ-వేస్ట్‭గా మారే ఫోన్లను సరిగా కనుక వాడుకుంటే సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల్లాంటి వాటికి పనికొస్తాయని యూనిటార్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 17 శాతం ఈ-వ్యర్థాలు మాత్రమే రీసైక్లింగ్ అవుతున్నట్టు యూనిటార్‌కు చెందిన సీనియర్ సైంటిఫిక్ స్పెషలిస్ట్, గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ ప్రధాన పరిశోధకుడు డాక్టర్ కీస్ బాల్డే తెలిపారు.

మిగిలినవి భూమిలోకి చేరుతున్నాయన్నారు. ఫలితంగా ప్రమాదకరమైన కాలుష్య సమస్యలు తలెత్తడంతోపాటు కాపర్, పల్లాడియం వంటి ఖనిజాలు పెద్దమొత్తంలో వృథా అవుతున్నాయని అన్నారు. మొబైల్ ఫోన్ ఉత్పతిలో భాగంగా జరిగే మైనింగ్, రిఫైనింగ్, ప్రాసెసింగ్ వంటి వాటి కారణంగా 80 శాతం గ్రీన్ హౌస్ ఉద్గారాలు ఉత్పత్తి అవుతున్నట్టు చెప్పారు. పాత ఫోన్లను మళ్లీ ఉపయోగించుకోగలిగితే ఈ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. యూరప్‌లో 8,755 కుటుంబాల్లో వేస్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఫోరమ్ నిర్వహించిన సర్వేలో ఒక ఇంటిలో సగటున 74 ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్టు తేలింది.

వీటిలో ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల, టోస్టర్లు వంటివి ఉన్నాయి. వీటిలో 13 వస్తువుల వరకు పనిచేయకపోయినా ఇంటిలోనే పెట్టుకుంటున్నారు. దీనికి సెంటిమెంట్, మరమ్మతు ఖర్చు లాంటివి కారణం. వీటిలో ఎక్కువగా పాత హెడ్‌ఫోన్లు, రిమోట్‌లు, గడియారాలు, ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్‌లు, రౌటర్లు, కీబోర్డులు, మౌస్‌లు, పాత ఫోన్లు వంటివి ఉన్నాయి. డాక్టర్ కీస్ బాల్డే దీనిపై మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా నేడు ఈ-వ్యర్థాలు 5.4 టన్నులకు చేరుకున్నట్టు పేర్కొన్నారు. వచ్చే మూడు దశాబ్దాల కాలంలో ఇవి రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

APJ Abdul Kalam: ఆ హెచ్చరికలతోనే 2014లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన మాజీ రాష్ట్రపతి కలాం