Hiring In USA: హమ్మయ్య..! అమెరికాలో ఆ ఒక్క నెలలోనే ఐదు లక్షల మందికి కొత్త ఉద్యోగాలు ..

ఒకవైపు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా అనేక పెద్ద టెక్ కంపెనీల్లో తొలగింపులు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోని బలమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతున్న అమెరికాలో కూడా కొన్ని కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించాయి. అదే సమయంలో.. జనవరి నెలలో అమెరికాలో ఐదు లక్షల మందికిపైగా కొత్త ఉద్యోగాలు పొందినట్లు యుఎస్ ప్రభుత్వం పేర్కొంది.

Hiring In USA: హమ్మయ్య..! అమెరికాలో ఆ ఒక్క నెలలోనే ఐదు లక్షల మందికి కొత్త ఉద్యోగాలు ..

US Jobs

Hiring In USA: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా పెద్దపెద్ద టెక్ కంపెనీలు కుదేలవుతున్నాయి. పలు టెక్ కంపెనీలు నష్టాల ఊబిలోకి కూరుకుపోయాయి. నష్టాల నుంచి బయటపడేందుకు కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తున్నాయి. అమెరికాలో కూడా పలు కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలిగించాయి. అమెరికాలో 90 రోజుల్లో ఐటీ రంగంలో రెండు లక్షల మందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇందులో 30 నుంచి 40శాతం మంది భారతీయ సంతతికి చెందినవారే ఉండటం గమనార్హం.

Amazon Lays Off Employees: అమెజాన్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ షురూ.. ఇంటిబాట పట్టనున్న 10వేల మంది..!

ఇప్పటికే ట్విటర్, గూగుల్, మైక్రో సాప్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్లో భారీ కోతను విధించాయి. దీంతో లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే కాలంలో మరికొంత మంది ఉద్యోగులు ఇంటిబాట పట్టబోతున్నారని పలు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ క్రమంలో ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోనన్న భయాందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో.. అమెరికాలో జనవరి నెలలో 5,17,000 మందికి కొత్త ఉద్యోగాలు రావటం కొంత ఊరటకలిగించే అంశం.

Google Layoffs 12,000 Employees : 12,000 మంది గూగుల్ ఉద్యోగుల తొలగింపు..క్షమాపణలు చెప్పిన సీఈవో సుందర్ పిచాయ్

జనవరి నెలలో ఐదు లక్షల మంది కొత్త ఉద్యోగాలు పొందినట్లు యూఎస్ ప్రభుత్వం పేర్కొంది. ఫెడరల్ రిజర్వ్ యొక్క నెమ్మదిగా వృద్ధి, అధిక వడ్డీ రేట్లతో ద్రవ్వోల్బణాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఫలితంగా అమెరికాలో నిరుద్యోగిత రేటు ప్రస్తుతం 3.4 శాతానికి తగ్గిపోయింది. అయితే, ఇది 1969 సంవత్సరం తర్వాత కనిష్ఠ స్థాయికి దిగజారింది.