Weird Law: భార్య బర్త్ డే రోజును మర్చిపోతే కటకటాలే.. మొదటి సారి ఓకే.. రిపీట్ అయితే ప్రాబ్లమే ..

సమోవ దేశంలో ఓ వింత చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం.. భర్తలు భార్యల పుట్టినరోజును తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే మొదటిసారి హెచ్చరికతో వదిలేస్తారు. రెండోసారి రిపీట్ అయితే ఐదేళ్లు జైలుకెళ్లాల్సిందే. ఇందుకోసం ఇలాంటి కేసులను పర్యవేక్షించేందుకు ఆ దేశంలో స్పెషల్ టీమ్స్ కూడా ఉన్నాయి.

Weird Law: భార్య బర్త్ డే రోజును మర్చిపోతే కటకటాలే.. మొదటి సారి ఓకే.. రిపీట్ అయితే ప్రాబ్లమే ..

Weird Law

Weird Law: ప్రపంచంలో అనేక సాంప్రదాయాలు, వింత ఆచారాలు ఉంటాయి. వీటికితోడు ఆశ్చర్యపర్చే చట్టాలుసైతం ఉంటాయి. ఇలాంటి తరహాలోనే సమోవ దేశంలో ఓ వింత చట్టం ఉంది. భార్య పుట్టినరోజు మరిచిపోవడాన్ని ఆ దేశంలో నేరంగా పరిగణిస్తారు. మొదటి సారి అయితే వార్నింగ్ ఇచ్చి క్షమించి ఒదిలేస్తాయి. రెండోసారీ భార్య పుట్టినరోజును మర్చిపోయారంటూ మగాళ్లు జైలుకెళ్లాల్సిందే. జైలు అంటే పదిరోజులు, ఇరవై రోజులు కాదు.. ఏకంగా ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇలాంటి కేసులను ప్రత్యేకంగా పరిశీలించేందుకు సమోవ దేశంలో పోలీస్ స్పెషల్ టీం కూడా ఉంది.

VIral News: బావిలో పడ్డా.. ప్రియురాలు దక్కింది..! అదృష్టమంటే వీడిదేకాబోలు..

మారుతున్న కాలానుగుణంగా డబ్బు అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కుటుంబం ఉన్నతంగా జీవించేందుకు డబ్బు సంపాదనకోసం ఎక్కువశాతం మంది పురుషులు ఉద్యోగరిత్యా తీరికలేని బిజీలైఫ్‌ను గడిపేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా భార్య పుట్టినరోజును గుర్తుపెట్టుకొని సెలెబ్రేట్ చేసేవారి సంఖ్య చాలా తక్కువ అనే చెప్పాలి. భార్య పుట్టినరోజు ఎప్పుడో తెలియని భర్తలే ఎక్కువగా ఉంటారు. అయితే, సమోవ దేశంలో అలాకాదు.. ప్రతీ ఒక్కరూ భార్య పుట్టిన రోజు తేదీను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిందే. లేకుంటే ఐదేళ్లు జైలు జీవితం గడిపేందుకు సిద్ధమవ్వాల్సి వస్తుంది.

Viral Video: “సో స్వీట్”.. సీమంతంలో దంపతుల డ్యాన్స్ అదుర్స్

అందానికి ప్రసిద్ధి చెందిన సమోవ దేశంలో చట్టం ప్రకారం.. భార్య పుట్టినరోజును భర్త తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఒకవేళ భర్త తన భార్య పుట్టినరోజును మర్చిపోతే తొలిసారి హెచ్చరికతో వదిలేస్తారు. అదే తప్పు రెండోసారి జరిగితే భర్తకు భారీ జరిమానాతో పాటు జైలు శిక్షసైతం విధిస్తారు. ఈ వింత చట్టం ప్రకారం.. భర్త ఐదేళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ దేశంలో ఈ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు పోలీస్ స్పెషల్ విభాగం ఉంది. పలుసార్లు ప్రత్యేక శిభిరాల ద్వారా ఈ చట్టంపై పోలీస్ స్పెషల్ విభాగం ఈ వింత చట్టంపై అవగాహన సదస్సులుసైతం నిర్వహిస్తోంది. ఇక్కడ ఓ ఫన్నీ వ్యాఖ్య ఏమిటంటే.. ఇదే చట్టం మన భారతదేశంలో ఉంటే సగంమందికిపైగా భర్తలు జైల్లోనే ఉండాల్సి వస్తుందేమో..