Heavy Floods : 30 రోజుల్లో కురవాల్సిన వాన ఒక్కరోజులో ముంచెత్తి..30,000మందిని నిరాశ్రయుల్ని చేసింది

మలేషియాలో 30 రోజుల్లో కురవాల్సిన వాన ఒక్కరోజులో ముంచెత్తింది.30,000మందిని నిరాశ్రయుల్ని చేసింది. 2014 తరువాత ఈ స్థాయిలో వర్షాలు, వరదలు మలేషియాని అతలాకుతలం చేస్తున్నాయి

Heavy Floods : 30 రోజుల్లో కురవాల్సిన వాన ఒక్కరోజులో ముంచెత్తి..30,000మందిని నిరాశ్రయుల్ని చేసింది

Malaysia Heavy Floods

Malaysia Heavy Floods : మలేషియాను వరదలు ముంచెత్తాయి. 2014 తరువాత ఇంత స్థాయిలో వర్షాలు కురవటం వరదలు ముంచెత్తటం మళ్లీ ఇప్పుడే జరిగింది. మలేషియాలు కురుస్తున్న వర్షాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే..30 రోజుల్లో కురవాల్సిన వర్షం ఒక్కసారే కురిసేసింది. గత ఆదివారం ఒక్కరోజే 30 రోజుల్లో కురవాల్సిన వాన ఒక్కరోజులోనే కురిసిందని అధికారులు చెబుతున్నారు. దీంతో 30,000మందికిపై ప్రజలు నిరాశ్రయలై దిక్కులేనివారిగా మిగిలిపోయారు. కొంతమంది అయితే ఈ వర్షాలకు,ముంచెత్తుతున్న వరదలకు భయపడి ఇళ్లు వదిలి బతుకు జీవుడా అంటూ పారిపోయిన దుస్థితి నెలకొంది.

ఈ వర్షాలకు రోడ్ల జాడే లేకుండాపోయారు. నదులు పొంగిపోతున్నాయి. రోడ్డు ఎక్కడుందో చూసి రోజులు దాటిపోయాయంటున్నారు స్థానికులు. ఎక్కడ చూసినా..ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఇళ్లముందే రోడ్లు మాయం అయిపోయి నదులు ప్రత్యక్షమయ్యాయి. 30 వేల మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మలేషియాలో ప్రస్తుత పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.

మలేషియాలో శుక్రవారం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాల కురుస్తునే ఉన్నాయి. ఈక్రమంలో గత ఆదివారం కురిసిన వర్షాలకు ప్రజలు హడలిపోయారు. ఆకాశానికి భారీ రంధ్రం పడిందా ఏంటి అన్నట్లుగా ఒక్కరోజు 30 రోజుల్లో కురవాల్సిన వర్షం కురిసిందని అధికారులు చెబుతున్నారు. దీంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. ప్రధాన రహదారులు తెగిపోయాయి. మలేషియా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలకు చెందిన 30 వేలకు పైగా వరద బాధితులను అధికారికంగా లెక్కించింది మలేషియా ప్రభుత్వం. వారిలో 14 వేల మంది పహంగ్‌కు చెందినవారే.

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో రిచెస్ట్‌ ప్లేస్‌ సెలంగోర్‌లో దాదాపు 10 వేల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారని..దేశ ప్రధాని ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ ప్రకటించారు. అంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

ఒక నెలమొత్తంలో కురవాల్సిన వర్షం, ఒక్కరోజే కురిసిందని తెలిపారు అధికారులు. వరద బాధితులకు సత్వర సహాయం నిమిత్తం 179 కోట్ల నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు ప్రధాని. మలేషియాతో ప్రతి ఏడాది చివరిలో రుతుపవనాల కారణంగా తరచూ అధిక వర్షపాతం నమోదవుతుంటుంది. ఈ డిసెంబర్‌లో ప్రమాదకర స్థాయిలో వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు.