Mars : అంగారకుడిని ముంచెత్తిన వరదలు..? కీలక చిత్రాలు పంపిన నాసా రోవర్

అరుణ గ్రహం మనిషి నివాస యోగ్యానికి అనుకూలమా? కాదా? దీన్ని తేల్చే క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై నాసా పరిశోధనలు జరుపుతోంది. నాసాకు చెందిన పర్సివరెన్స్‌

Mars : అంగారకుడిని ముంచెత్తిన వరదలు..? కీలక చిత్రాలు పంపిన నాసా రోవర్

Nasa Mars

NASA Mars : అరుణ గ్రహం మనిషి నివాస యోగ్యానికి అనుకూలమా? కాదా? దీన్ని తేల్చే క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై నాసా పరిశోధనలు జరుపుతోంది. నాసాకు చెందిన పర్సివరెన్స్‌ రోవర్ కీలక చిత్రాలు పంపుతోంది. ఇప్పటికే మార్స్ పై నీటి జాడలను తెలిపే ఆధారాలు పంపిన నాసా రోవర్.. తాజాగా వరద జాడలను గుర్తించడం విశేషం.

‌తాను దిగిన జీజెరో క్రాటర్‌ ప్రాంతంలోనే వరద జాడలను రోవర్ గుర్తించడం విశేషం. కుంభవృష్టి వరదలతో లోతైన గుంతలు ఏర్పడి ఉండొచ్చని సైంటిస్టులు నిర్ధారణకు వచ్చారు. ఇక కొత్త రోవర్‌తో అనుసంధానం కాసేపు ఆగిపోవడానికి ముందు.. పర్సివరెన్స్‌ కీల చిత్రాలను నాసా సెంటర్‌కు పంపింది.

Flipkart: మళ్లీ అవకాశం రాకపోవచ్చు.. ఫ్లిప్ కార్ట్‌లో రూ.10వేల లోపు టాప్-5 ఫోన్‌లు ఇవే!

అంగారకుడి ఉపరితలంపై తీసిన ఈ చిత్రాలను పరిశీలించిన తర్వాత.. నాసా పలు విషయాలను తెలిపింది. ఆ కాలంలో మార్స్‌ మీద వాతావరణం దట్టంగా ఉండేదన్నారు. జీజెరో క్రాటర్‌ను ఒక సరస్సుగా దాదాపు నిర్ధారణకు వచ్చేశారు. నదులు, వాటి ప్రవాహం వల్ల మార్స్ మీద ఫ్యాన్‌ ఆకారంలో డెల్టా ప్రాంతాలు సైతం ఏర్పడ్డాయని గుర్తించారు. సరస్సు ఎండిపోయిన చిన్న భూభాగాలు.. నది డెల్టా ప్రాంతానికి చెందినవే అయ్యి ఉంటాయన్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో కుంభవృష్టి వరదలు ముంచెత్తాయి.. బహుశా ఆ ప్రాంతమంతా ఎండిపోయి ఉండొచ్చని అంచనా వేశారు. వరదలతో సరస్సుల్లోకి కొట్టుకొచ్చిన రాళ్లు రప్పల చిత్రాలనే పర్సివరెన్స్‌ రోవర్ నాసాకి పంపిందన్నారు.

వంద‌ల కోట్ల ఏళ్ల క్రితం మార్స్ గ్ర‌హంపై న‌దులు ప్ర‌వ‌హించాయని, ఆ ప్ర‌వాహం వ‌ల్లే ఇప్పుడు ఆ గ్ర‌హం ఇలా క‌నిపిస్తోంద‌ని నాసా శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. నాసాకు చెందిన ప‌ర్సివ‌రెన్స్ రోవ‌ర్ తీసిన చిత్రాలు మార్స్ గ్ర‌హంపై న‌దుల ప‌రీవాహ‌క ప్రాంతాల‌ను చూపించిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. దీని ఆధారంగా అక్క‌డ ప్రాచీన జీవ‌నానికి చెందిన ఆధారాలు దొర‌కుతాయ‌ని వాళ్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Air Conditioners : ఏసీల వినియోగం ఆరోగ్యానికి లాభమా…నష్టమా?..

ఫిబ్ర‌వ‌రిలో జెజిరో లోయ‌ల్లో ప‌ర్సివ‌రెన్స్ రోవ‌ర్ దిగిన విష‌యం తెలిసిందే. ఆ ప్రాంతంలో బిలియ‌న్ల ఏళ్ల క్రితం ఓ న‌ది ప్ర‌వాహించిన‌ట్లు అనుమానించారు. దాని వ‌ల్ల అక్క‌డ ఫ్యాన్ ఆకారంలో ఉన్న డెల్టా ప్రాంతం ఏర్ప‌డిన‌ట్లు భావిస్తున్నారు. ప‌ర్సివ‌రెన్స్‌లోని హై రెజ‌ల్యూష‌న్ కెమెరాలు తీసిన ఫోటోల‌ను శాస్త్ర‌వేత్త‌లు స్ట‌డీ చేస్తున్నారు. ఒక‌ప్పుడు అక్క‌డే నదీ ప‌రీవాహ‌క ప్రాంతం ఉన్న‌ట్లు గుర్తించారు. కొండ లోయ‌ల్లో ఉన్న చారిక‌ల ఆధారంగా అక్క‌డ నీరు ప్ర‌వ‌హించిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

సుమారు 3.7 బిలియ‌న్ల ఏళ్ల క్రితం మార్స్ గ్ర‌హం జీవానికి అనుకూలంగా ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. లోయ ప్రాంతాల్లో ఉన్న కొన్ని రాళ్లు అక్క‌డ నీటి ఉదృతికి ఆన‌వాళ్లు అని కూడా చెప్పారు.

మార్స్‌పై జీవజాలం ఉనికిని గుర్తించడానికి నాసా పంపిన ముఖ్యమైన ప్రాజెక్ట్ పర్సివరెన్స్ రోవర్. దశబ్దాలుగా ఈ ప్రాజెక్ట్ కోసం బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. అంగారకుడిపై ఈ మల్టీ టాస్కింగ్ రోవర్ 30కిపైగా రాయి, మట్టి నమూనాలను సీల్డ్ ట్యూబ్‌లలో సేకరించనుంది. ఆ తర్వాత 2030లో ఎప్పుడైనా భూమికి తిరిగి పయనమవుతుంది.

ఉపరితలంపై రాతి నమూనాలను సేకరించడానికి పర్సివరెన్స్ ఆగస్టులో చేసిన తొలి ప్రయత్నం విఫలమైంది. రెండోసారి సెప్టెంబర్ లో రోవర్ చేసిన ప్రయత్నం విజయమవంతమైనట్టు నాసా ప్రకటించింది. ఒక ట్యూబ్ లోపల పెన్సిల్ కంటే కొంచెం మందంగా ఉన్న రాతి నమూనా ఉన్న ఫోటోను షేర్ చేసిన నాసా.. ఈ నమూనాను సెప్టెంబర్ 1న పర్సివరెన్స్ సేకరించినట్టు తెలిపింది.