Viral Video : పెంపుడు బ‌ల్లితో పార్కులో షికారు..జనాలు బేజారు

ఓ వ్యక్తి ఓ విచిత్రమైన జీవిని పెంచుకుంటున్నాడు.అదేమంటే జరాసిక్ పార్క్ సినిమాలో ఉండే ఓ వింత ప్రాణి. దాన్ని పార్కులో షికారు చేస్తుంటే చూసిన జనాలంతా షాక్ అవుతున్నారు.

Viral Video : పెంపుడు బ‌ల్లితో పార్కులో షికారు..జనాలు బేజారు

Man Takes Out His Pet Lizard For A Walk

man takes out his pet lizard for a walk  :  కుక్కలు, పిల్లలు, ఉడుతలు,పాములు,చిలుకలు,కోతులు,ఎలుకలు,పావురాలు ఇలా ఎన్నోవాటిని పెంచుకుంటారు.ఇంకా జింకలు, నెమళ్లను కూడా పెంచుకుంటారు. కొంతమంది అయితే పెద్ద కొండ చిలువల్ని, మొసళ్లను కూడా పెంచుకుంటారు. పెట్స్ అంటే అంత ఇష్టం వారి. ఎవరి ఇష్టం వారిది. కానీ ఓ వ్యక్తి మాత్రం ఫుల్ డిఫరెంట్. బల్లి కనిపిస్తే చాలు ఏదో పాముని చూసినట్లు హడలిపోతారు.అటువంటిది ఓ వ్యక్తి ఓ బల్లిని పెంచుకుంటున్నాడు.

ఆ బల్లిని ప్రతీరోజు షికారుకు బయటకు తీసుకెళతాడు. పార్కుల్లో వాకింగ్ చేయిస్తాడు.అది పారిపోకుండా దాని మెడకు ఓ తాడు కూడా కడతాడు. అలా ఆ తాడు పట్టుకుని తన పెంపుడు బల్లితో వాకింగ్ కు వెళతాడు. అతని చేతిలో తాడుని..దానికున్న బల్లిని చూసిన జనాలు షాక్ అవుతారు.బల్లి అంటే భయపడేవారు బేజారెత్తిపోతారు. అదిచూసి అతను సరదాగా నవ్వేసుకుంటాడు.

యూఎస్‌లోని ఫ్లొరిడాలో ఉండే ఓ వ్య‌క్తి ఓ బ‌ల్లిని పెంచుకుంటున్నాడు. ఇది సాదారణంగా మన ఇంట్లో గోడలమీద కనిపించే బల్లికాదు. బ‌ల్లి జాతికే చెందినది. జురాసిక్ పార్క్ సినిమా డిలోఫోసారస్ ని చూశారు కదూ..అటువంటిదే ఇది. అచ్చం ఈ బ‌ల్లి కూడా ఇలాగే ఉంటుంది. కానీ ఇది డిలోఫోసార‌స్ కాదు.కానీ దాదాపు అలాగేఉంటుంది.

దాన్ని ప్ర‌తి రోజూ వాకింగ్‌కు అక్క‌డ ఉన్న పార్క్‌కు తీసుకెళ్తాడ‌ట‌. అది పారిపోకుండా ఉండేందుకు దాని మెడ‌కు ఓ తాడు కూడా క‌ట్టాడు. ఆ తాడుతో దాన్ని పార్క్ అంతా తిప్పుతాడు, అది పార్క్ లో ఉండే చెట్లు ఎక్కుతుంది. చక్కగా తిరుగుతుంది.  ఆ త‌ర్వాత ఇంటికి తీసుకెళ్తాడు. అయితే.. ఈ బ‌ల్లి నోరు తెరిస్తే భ‌యంక‌రంగా క‌నిపించిన‌ప్ప‌టికీ.. ఆ బ‌ల్లి అంత డేంజ‌ర్ కాదు. దాన్ని ఫ్రిల్డ్ డ్రాగ‌న్ అని కూడా పిలుస్తార‌ట‌. ఆస్ట్రేలియా, న్యూగునియా లాంటి ప్రాంతాల్లో ఎక్కువ‌గా తిరుగుతుంటాయి.