Flying Taxi: భవిష్యత్ రవాణా మొత్తం గాల్లోనే..

Flying Taxi: భవిష్యత్ రవాణా మొత్తం గాల్లోనే..

ఆఫీసు పని 8 గంటలు.. ట్రాఫిక్‌లో గడిపేది 4 గంటలు.. ఇలా సగం రోజు గడిచిపోతుంటే మిగిలిన పనులు చేసుకునేదెలా. గుయ్ గుయ్ మంటూ హారన్‌లు, గుండెలదిరే క్రాసింగ్‌లు, ఒక్కోసారి అదుపు తప్పితే ప్రాణాలు గాల్లోకే. 

అవసరాలకు తగ్గట్టు ట్రెండ్ మార్చుకుని ముందుకు పోతున్నాం. ఆర్టీసీ బస్సు-లోకల్ ట్రైన్-మెట్రో ట్రైన్ ఇలా ట్రాఫిక్‌ను అధిగమించడానికి ఎన్నో దార్లు వెతుక్కుంటున్నాం.  వీటన్నిటికీ తలదన్నే విధంగా గాల్లోకి ఎగురుతూ వెళ్లే ప్రయాణం అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది. ఆ ఆలోచన రాగానే ప్రశాంతంగా క్షణాల వ్యవధిలో ఇంటికి చేరిపోతాం అని ఊపిరి పీల్చుకుంటాం. నిజమే.. ఆ సదుపాయం వచ్చేందుకు మరెన్నో రోజులు లేదు. 
Read Also: జొమోటో నుండి 5వేల రెస్టారెంట్లు ఔట్

వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే పలు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఖర్చు, షేప్‌‍లను దృష్టిలో ఉంచుకుని వీటి డిజైన్ చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా.. 

1. వూబర్ ఎలివేట్
గాల్లోకి 90 డిగ్రీలు పైకి లేచి ఏ మాత్రం కుదుపులు లేకుండా చేరాలనుకున్న దూరాలకు చేర్చుతుంది. 
2. ఆడి పాప్.అప్ నెక్స్ట్
ఇది సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్. డ్రైవర్ కూడా లేకుండానే ప్రయాణించవచ్చు. దీనితో పాటు అదనంగా కారు కూడా ఉంటుంది. అంటే ట్రాఫిక్ లేని ప్రదేశాల్లో కావాలంటే కారులో కూడా వెళ్లొచ్చు. మళ్లీ కావాలనుకుంటే వింగ్స్‌ను రిమోట్ సాయంతో ఆపరేట్ చేయొచ్చు.
3. వర్టికల్ ఏరో స్పేస్
అన్నింటిలో ఖరీదైనది. సౌకర్యవంతమైనది ఇదే. కారులో ప్రయాణిస్తున్నట్లే ఉంటుంది. ఎక్కడైనా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా దీని కింద ఏర్పాటు చేసిన చక్రాలు అనుకూలంగా ఉంటాయి. 

ఇలా మరి కొద్ది రోజుల్లో మార్కెట్ లోకి వచ్చేందుకు మరిన్ని flying taxiలు రెడీ అయిపోతున్నాయి.