Tiger-Lion Meat : సింహం మాంసంతో బర్గర్.. పులి స్టిక్స్​..జీబ్రా,జిరాఫీలతో వంటకాలు..టేస్ట్ చేయటానికి రెడీనా?!

సింహం మాంసంతో బర్గర్.. పులి మాంసంతో స్టిక్స్​..జీబ్రా,జిరాఫీలతో కొత్త కొత్త వంటకాలు..టేస్ట్ చేయటానికి రెడీగా ఉన్నారా? ఈ మాంసాల విక్రయం లీగర్ గానే భయపడనక్కర్లా..

Tiger-Lion Meat : సింహం మాంసంతో బర్గర్.. పులి స్టిక్స్​..జీబ్రా,జిరాఫీలతో వంటకాలు..టేస్ట్ చేయటానికి రెడీనా?!

Lab Grown Food Startup Will Soon Serve Lion Tiger And Elephant Meat

lab grown food startup will soon serve lion tiger and elephant meat: మాంసం ప్రియులకు ఎన్ని రకాల మాంసం తిన్నా తీరదు. ఇంకా ఏదో కొత్త రుచి కోసం ఆరాటపడతారు. చికెన్,మటన్,బీఫ్, ఫోర్క్ ఇలా ఎన్నో రకాల మాంసాలు తిన్నవారు కూడా బహుశా పులి, సింహం లాంటి జంతువుల మాంసం తిని ఉండరు. చికెన్,మటన్,బీఫ్, ఫోర్క్ వంటివైతే మార్కెట్ లో దొరకుతాయి. పులి, సింహం మాంసాలా? సాధ్యమేనా? ఆ ఆలోచన వస్తేనే జైల్లో పారేసి ఇరగ కుమ్మేయరు?అని భయపడిపోవచ్చు. కానీ ఇప్పుడు పులి, సింహం మాంసాలతో తయారు చేసిన వంటకాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
‘చికెన్, మటన్​తో వంటకాలు పాత పద్ధతి.. సింహం, పులి, ఏనుగు, జిరాఫీ మాంసం డిషెస్ ఇప్పుడు నయా ట్రెండ్​’ అంటోంది ఓ స్టార్టప్ కంపెనీ.

అతి త్వరలోనే ఇప్పుడు వరకు చెప్పుకున్న జంతువులే కాదు క్రూర మృగాల మాంసాలతో కొత్త కొత్త టేస్టి టేస్టీ వంటలను అందుబాటులోకి తేనుందీ స్టార్టప్ కంపెనీ.దీని కోసం​ సెషన్​ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అసలు ఇదంతా ఎలా సాధ్యం? వన్యమృగాల మాంసంతో వంటలు చేయడం నేరం కాదా? అవి తింటే మనుషులకేం కాదా? ఏమన్నా అవుతుందో అవ్వదో పక్కన పెడితే జైల్లో పారేస్తారేమో? అనే భయం కూడా లేకపోలేదు. కానీ ఇవన్నీ పక్కా లీగల్ గా అందుబాటులోకి తెస్తామంటోందీ కంపెనీ..ఈ మాంసాలతో తయారు అయిన వంటకాలు త్వరలో జరగబోయే ఓ ఫుడ్​ ఫెస్టివల్​ మెనూలో భాగం. ఇది జోక్ కాదు. ఇది ముమ్మాటికీ నిజం. చట్టబద్ధం కూడా. ఇదంతా ఎలా సాధ్యమని అనుకుంటున్నారా?

Also read : Space meat : అంతరిక్షంలో మాంసం తయారు చేయనున్న పరిశోధనలు

స్టార్టప్​ కంపెనీ వెరైటీ ఆలోచన: చికెన్, మటన్, బీఫ్, పోర్క్.. దాదాపు అన్ని దేశాల్లో తినే మాంసాహారాలు ఇవే. చైనాలో అయితే పిల్లులు, కుక్కలు, కుందేళ్లతో పాటు గబ్బిలాలు కూడా అందుబాటులో ఉంటాయి మార్కెట్లలో. కానీ చాలాదేశాల్లో మాంసాల కోసం వన్యమృగాల జోలికి వెళ్లడం చట్టవిరుద్ధం. చట్టం సంగతి పక్కనబెడితే.. అసలు వాటిని తినాలన్న ఆలోచనే ఎవరికీ రాదు. ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచించింది లండన్​ కేంద్రంగా పనిచేసే ప్రిమేవల్ ఫుడ్స్ అనే అంకుర సంస్థ. సెల్యూలర్ వ్యవసాయంతో ముడిపడిన వ్యాపారం చేసే ఆ సంస్థ.. జంతువుల జోలికి వెళ్లకుండా ల్యాబ్​లోనే వన్యమృగాల మాంసాన్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదని అనుకుంది.

ల్యాబ్​లో మాంసం అభివృద్ధి కొత్తేం కాదు. జంతువుల కణాలను ప్రాసెస్(సెల్ కల్చరింగ్) చేసి పరిశోధనశాలలోనే తయారు చేసిన చికెన్, మటన్ వంటివి ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. ఈ రంగంలో ఉన్న అవకాశాల్ని క్యాష్ చేసుకోవానికి అనేక ఫుడ్​ టెక్​ కంపెనీలు పోటీపడుతున్నాయి. ‘‘ప్రిమేవల్ ఫుడ్స్’’ మరో అడుగు ముందుకేసింది. ‘వీటిని కూడా తింటారా?’ అని జనం అనుకునే జంతువులపై దృష్టిపెట్టింది.

“మనం చికెన్, బీఫ్​ వంటి వాటికే పరిమితం కావడానికి.. అవి రుచికరం, ఆరోగ్యకరం, పోషకాలతో కూడుకున్నవి మాత్రమే కారణాలు కాదు. ఆ జంతువులను పెంచడం సులువు కాబట్టే మనం వాటికి ఎక్కువగా అలవాటుపడ్డాం. ఇప్పుడు ల్యాబ్​లో అభివృద్ధి చేసే మాంసం విషయంలో మనం ఆ సంప్రదాయ జంతువుల్ని దాటి మరో అడుగు ముందుకెళ్లొచ్చు. మరింత రుచికరమైన, ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడుకున్న మాంసాల్ని అభివృద్ధి చేయవచ్చు. ఇలాంటి వాటి వల్ల కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్స్ వంటి ఇబ్బందులు లేకుండా మన మెదడు, జీర్ణవ్యవస్థలో సరికొత్త మార్పులు వచ్చే అవకాశముంది.

Also read : Nitin Gadkari: రాజ్ థాకరేను కలిసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ: రాజకీయ ఎజెండా కాదని వెల్లడి

ఆయా జంతువుల మాంసంలోని ప్రొటీన్, ఎమైనో యాసిడ్​ ప్రొఫైల్​లోని విలక్షణత ఇందుకు కారణం. నిద్ర బాగా పట్టేందుకు ఉపకరించే జాగ్వార్ మాంసం, మన ఆలోచనా శక్తిని మెరుగుపరిచే ఏనుగు మాంసం అభివృద్ధి చేయాలని మేము భావిస్తున్నాం.” అని వివరించారు ప్రిమేవల్ ఫుడ్స్​ పెట్టుబడిదారు సంస్థ అయిన ఏస్ వెంచర్స్​ మేనేజింగ్ పార్ట్​నర్​ యిల్మాజ్ బోరా.

త్వరలోనే రుచి చూపిస్తామంటున్న ప్రిమేవల్ ఫుడ్స్..
వన్యమృగాల మాంసంతో చేసిన వంటకాలను ప్రపంచానికి రుచి చూపించేందుకు రెడీ అవుతోంది ‘‘ప్రిమేవల్ ఫుడ్స్’’. వచ్చే నెలల్లో లండన్​లో టేస్టింగ్ సెషన్​ నిర్వహించాలని భావిస్తోంది.దీనికోసం ఓ మెనూను రూపొందించి, విడుదల చేసింది.

“ఈ మాంసాల అభివృద్ధి కోసం మేము జంతువులను ఇబ్బంది పెట్టం. జంతుప్రదర్శనశాలలో ఉన్న ముగజీవుల నుంచి వాటి కణాలను సేకరిస్తాం. వాటిని ల్యాబ్​లో కల్చరింగ్ చేస్తాం. ఈ మాంసం గురించి వినేందుకు వింతగా ఉన్నా.. జంతువులను ఇబ్బంది పెట్టలేదు కాబట్టి రుచి చూసేందుకు చాలా మంది ముందుకు వస్తారనే భావిస్తున్నాం.” అని తెలిపింది ప్రిమేవల్ ఫుడ్స్​.